Share News

యువత మత్తుకు బానిస కావొద్దు

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:44 AM

యువత మత్తుకు బానిస కావొద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు.

యువత మత్తుకు బానిస కావొద్దు
మాట్లాడుతున్న లీలా వెంకట శేషాద్రి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి

కర్నూలు హాస్పిటల్‌, జూన 26(ఆంధ్రజ్యోతి): యువత మత్తుకు బానిస కావొద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి అన్నారు. డ్రగ్స్‌ దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతి రేక దినోత్సవం సందర్భంగా గురువారం ఉదయం విశ్వభారతి మెడికల్‌ కాలేజీలో ప్రిన్సిపాల్‌ డా. కృష్ణ నాయక్‌ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కార్యక్రమాన్ని బి.లీలా వెంకటశేషాద్రి, శాశ్వత లోక్‌ అదాలత చైర్మన వెంకట హరినాథ్‌ హాజరయ్యారు. లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం మెడికల్‌ కాలేజీ విద్యార్థులకు ర్యాగింగ్‌ దానికి సంబంధించిన శిక్షలు, జరిమానాలను వివరించారు. విశ్వభారతి మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డా.కృష్ణ నాయక్‌ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. అనంతరం పారా లీగల్‌ వలంటీర్‌ రాయపాటి శ్రీనివాస్‌ ర్యాగింగ్‌, మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంపై విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.

Updated Date - Jun 27 , 2025 | 12:44 AM