Share News

చరిత్రను యువత తెలుసుకోవాలి

ABN , Publish Date - Jul 02 , 2025 | 12:55 AM

జిల్లా చరిత్రను యువత తెలుసుకోవాలని రిజిస్ర్టార్‌ కట్టా వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం నగరంలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో కర్నూలు జిల్లా 167వ అవిర్భావ దినోత్సవాలను కర్నూలు జిల్లా మేధావుల వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

చరిత్రను యువత తెలుసుకోవాలి
మాట్లాడుతున్న క్లస్టర్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ కట్టా వెంకటేశ్వర్లు

పరిశోధనల కేంద్రంగా క్లస్టర్‌ యూనివర్సిటీ

రిజిస్ర్టార్‌ కట్టా వెంకటేశ్వర్లు

కర్నూలు అర్బన్‌, జులైౖ 1 (ఆంధ్రజ్యోతి): జిల్లా చరిత్రను యువత తెలుసుకోవాలని రిజిస్ర్టార్‌ కట్టా వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం నగరంలోని ప్రభుత్వ బాలుర డిగ్రీ కళాశాలలో కర్నూలు జిల్లా 167వ అవిర్భావ దినోత్సవాలను కర్నూలు జిల్లా మేధావుల వేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మానవశక్తి పరిశోధన కేంద్రం వ్యవస్థాపకులు ఆచార్య షేక్‌ మన్సూర్‌ రహ్మాన్‌, ప్రముఖ వ్యాపారవేత్త, జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్‌ కల్కూర చంద్రశేఖర్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కేక్‌ కట్‌ చేసిన సంబరాలు జరుపుకున్నారు. కర్నూలు జిల్లా ఆవిర్భావం.. ఘన చరిత్రపై క్లస్టర్‌ వర్సిటీలో అంతర్భాగమైన కేవీఆర్‌ మహిళా డిగ్రీ కాలేజీ, సిల్వర్‌ జుబ్లీ డిగ్రీ కాలేజీ, ప్రభుత్వ బాలుర డిగ్రీ కాళాశాలలో వ్యాస రచన పోటీల్లో నిర్వహించారు. విజేత విద్యార్థులకు విజ్ఙానం పెంచే పుస్తకాలు, ప్రశంస పత్రాలు, సీల్డ్‌ను అందజేశారు. చెరగని చరిత్రకు చిరునామ కర్నూలు అని, ఇక్కడ పని చేయడం జీవితంలో మరవలేని ఘట్టమన్నారు. మానవశక్తి పరిశోధన కేంద్రం వ్యవస్థాపకులు ఆచార్య షేక్‌ మన్సూర్‌ రహ్మాన్‌ మాట్లాడుతూ బ్రిటీష్‌ పాలకులు పాలెగాళ్ల పాలనను అంతం చేసి రాయలసీమగా పిలవబడే జిల్లాలను దత్త మండలా లుగా చేశారన్నారు. మొదట కడప, బళ్లారి జిల్లాలు ఉండేవని, 1858లో కర్నూలు జిల్లా ఏర్పడిందన్నారు. కల్కూర చంద్రశేఖర్‌ మాట్లాడుతూ రాయలసీమ జిల్లాల్లో ఎంతో వెనుకబడిన జిల్లా కర్నూలు.. సాగునీటి ప్రాజెక్టు కోసం పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే వేదవతి, ఆర్డీఎస్‌, గుండ్రేవుల ప్రాజెక్టులు తక్షణమే చేపట్టాలన్నారు. జిల్లా ఘనచరిత్ర, స్వాతంత్య్ర పోరాటంలో అశువులు బాసిన వీరుల గురించి విరించారు. అడ్మినిస్ట్రేషన్‌ డీన్‌ అత్తర్‌ బాను, ప్రభుత్వ బాలుర డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్‌ ఇందిరాశాంతి, కేవీఆర్‌ మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్‌ వెంకటరెడ్డి, అధ్యాపకులు సోమశేఖర్‌ తదితరులు పాల్గొని ప్రసగించారు.

Updated Date - Jul 02 , 2025 | 12:55 AM