యువత పోరాటాలకు సిద్ధం కావాలి
ABN , Publish Date - May 03 , 2025 | 11:44 PM
నిరుద్యోగులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యువత పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి నక్కి లెనినబాబు పిలుపు నిచ్చారు.
జాతీయ కార్యదర్శి లెనినబాబు
ఘనంగా ఏఐవైఎఫ్ ఆవిర్భావ దినోత్సవం
కర్నూలు న్యూసిటీ, మే 3(ఆంధ్రజ్యోతి): నిరుద్యోగులను మోసం చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై యువత పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐవైఎఫ్ జాతీయ కార్యదర్శి నక్కి లెనినబాబు పిలుపు నిచ్చారు. శనివారం సీఆర్ భవనలో ఏఐవైఎఫ్ 66వ ఆవిర్భావ దినోత్స వం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి శ్రీనివా సులు అధ్యక్షతన వహించగా మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్. మునెప్ప జెండాను ఆవిష్కరించారు. లెనినబాబు మాట్లాడుతూ మోదీ అధికారం లోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మాటను గాలికి వదిలేశారన్నారు. అంబానీ, ఆదానీలకు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అ మలు చేయడంలో వైఫల్యం చెందిందన్నారు. కార్యక్రమంలో మాజీ నాయకులు రామకృష్ణారెడ్డి, రామాంజనేయులు, జిల్లా సహాయ కార్యద ర్శి శరతకుమార్, ఏఐటీయూసీ నగరకార్యదర్శి చంద్రశేఖర్ పాల్గొన్నారు.