యువతి ఆత్మహత్యాయత్నం
ABN , Publish Date - Dec 14 , 2025 | 12:25 AM
పట్టణంలోని ఎన్జీవో కాలనీకి చెందిన హర్షిత శనివారం ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. హర్షిత వెంకటేశ్ అనే వ్యక్తిని గత ఏడాది ప్రేమ వివాహం చేసుకుంది. అయితే కుటుంబ కలహాలతో ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
ఆసుపత్రికి తీసుకెళ్లే సమయంలో అడ్డంగా మంత్రి వాహనం
చేతులపై ఆసుపత్రి తీసికెళ్లిన సిబ్బంది, పోలీసులు
నంద్యాల టౌన్ డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఎన్జీవో కాలనీకి చెందిన హర్షిత శనివారం ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. హర్షిత వెంకటేశ్ అనే వ్యక్తిని గత ఏడాది ప్రేమ వివాహం చేసుకుంది. అయితే కుటుంబ కలహాలతో ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు నంద్యాల జీజీహెచ్ ఆసుపత్రికి తీసుక వెళుతుండగా ప్రభుత్వం ఆసుపత్రి ఎదుట నడి రోడ్డుపై మీటింగ్ ఏర్పాటు చేయడంతో ఆటో లోపలికి వెళ్లడం ఇబ్బం దయింది. ఆ సమయంలో ఒక మంత్రి కారు అడ్డంగా ఉండడంతో ఆమెను ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు చేతులపై ఎత్తుకుని లోపలికి తీసికెళ్లారు.
నడి రోడ్డుపై మీటింగ్ ఏర్పాటు చేయడంపట్ల విమర్శలు..
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి ఎదురుగా వాజ్‌పేయి విగ్రహ అవిష్కరణ సభ ఏర్పాటు చేయడంతో శుక్రవారం రాత్రి నుంచి స్థానికులు, ఆసుపత్రికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంబులెన్స్‌లు, పేషెంట్లు ఆస్పత్రిలోకి వెళ్లడం కష్టమైంది. ఇట్లా రోడ్డు మీద మీటింగ్ ఏర్పాటు చేయడంపట్ల విమర్శలు వినిపించాయి.