Share News

దినచర్యలో యోగా భాగం కావాలి

ABN , Publish Date - Jun 09 , 2025 | 11:46 PM

ప్రజలు యోగాను తమ దినచర్యలో భాగం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య పిలుపునిచ్చారు.

దినచర్యలో యోగా భాగం కావాలి
యోగాంధ్ర ర్యాలీని ప్రారంభిస్తున్న జేసీ బి.నవ్య

జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య

కర్నూలు న్యూసిటీ, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): ప్రజలు యోగాను తమ దినచర్యలో భాగం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ బి.నవ్య పిలుపునిచ్చారు. యోగాంధ్రలో భాగంగా సోమవారం ఉదయం కలె క్టరేట్‌ గాంధీ విగ్రహం నుంచి రాజ్‌విహార్‌ సర్కిల్‌ వరకు నిర్వహించిన మాస్‌ ర్యాలీని జేసీ ప్రారంభించారు. మూడు బెలూన్లను గాలిలోకి వదిలి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ యోగాసనాల ద్వారా మనసు ప్రశాంతంగా ఉండటంతో మెరుగైన ఆరో గ్యం సొంతమవుతుందన్నారు. కార్యక్రమంలో నగరపాలక కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు, డీటీసీ శాంతకుమారి, డీఎస్‌వో రాజారఘువీర్‌, డీఎంఅండ్‌హెచ్‌వో శాంతికళ, హౌసింగ్‌ పీడీ చిరంజీవి, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ వెంకటేశ్వర్లు, సెట్కూరు సీఈవో వేణుగోపాల్‌, డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి, నగరపాలక మేనేజర్‌ చిన్నరాముడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 09 , 2025 | 11:46 PM