Share News

యోగాంధ్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

ABN , Publish Date - May 28 , 2025 | 12:11 AM

యోగాంధ్ర కార్యక్రమా లను సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని జాయింట్‌ కలెక్టర్‌ నవ్య సోషల్‌ మీడియా ఇన్సూప్లెయెన్సర్‌ను సూచించారు.

యోగాంధ్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ నవ్య

కర్నూలు కలెక్టరేట్‌, మే 27(ఆంధ్రజ్యోతి): యోగాంధ్ర కార్యక్రమా లను సోషల్‌ మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని జాయింట్‌ కలెక్టర్‌ నవ్య సోషల్‌ మీడియా ఇన్సూప్లెయెన్సర్‌ను సూచించారు. మంగళ వారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స హాలులో యోగాంధ్ర-2025 యోగా సాధన, అవగాహన మహోత్సవం సందర్భంగా యోగా కార్యక్రమాల ప్రచారం గురించి సోషల్‌ మీడియా ఇనూఫ్లూయెర్లతో జాయింట్‌ కలెక్టర్‌ సమావేశం నిర్వహించారు. జేసీ నవ్య మాట్లాడుతూ సమాజంలో కొంత మంది మాత్రమే యోగాపై అవగాహన ఉందని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు కూడా అవగాహన కల్పించడం అవసరమన్నారు. కార్యక్ర మంలో జిల్లా టూరిజం అధికారి విజయ, జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్‌ పాల్‌, మెప్మా పీడీ నాగ శివలీల, జిల్లా రెసిడెన్షియల్స్‌ స్కూల్స్‌ కోఆర్డినేటర్‌ డా.శ్రీదేవి, సోషల్‌ మీడియా ఇనప్లూయెన్సర్స్‌ రాజు, రంగ స్వామి, రామాంజనేయులు, ఎస్‌.హర్షిత పాల్గొన్నారు.

Updated Date - May 28 , 2025 | 12:11 AM