Share News

ఉల్లిపై వైసీపీ రాజకీయం

ABN , Publish Date - Sep 08 , 2025 | 01:13 AM

ఉల్లిపై వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని పరిశ్ర మల శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

ఉల్లిపై వైసీపీ రాజకీయం
పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌

కర్నూలు అర్బన్‌ , సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఉల్లిపై వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని పరిశ్ర మల శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉల్లి రైతులను అడ్డుపెట్టుకుని వైసీపీ నాయకులు డ్రామాలు అడుతున్నారన్నారు. ప్రభుత్వం క్వింటాం ఉల్లిని రూ.1,200కు కొనుగోలు చేస్తుందని, ఇదివరకే సీఎం చంద్రబాబు ప్రకటించినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ వైసీపీ నాయకులు ఈవిషయంలో రాజకీయం చేస్తున్నారన్నారు. క్షేత్ర స్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే రైతులకు నష్టం లేకుండా చూసుకునేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు ఛీకొట్టినా వైసీపీ నాయకులకు ఇంకా బుద్ధి రాలేదన్నారు. ఒక వైపు సంక్షేమం, మరో వైపు రాష్ర్టాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు ఆహర్నిశలు కష్టపడుతున్నారని తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు పని లేకుండా కేవలం రైతులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం పై బురదజల్లేందుకు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఽధ్వజమెత్తారు. ఎలాంటి సమస్య లేకున్నా ఏదో ఉన్నట్లు సృష్టించడంలో వైసీపీ నాయకులు ఆరితేరారని ఎద్దేవా చేశారు. పేపర్‌ ఉంది కదా అని ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజలు గమనిస్తున్నారన్నారు.

Updated Date - Sep 08 , 2025 | 01:13 AM