Share News

తప్పుడు ప్రచారంతో వైసీపీ విషం

ABN , Publish Date - Jun 19 , 2025 | 12:15 AM

టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై వైసీపీ తప్పుడు ప్రచారాంతో విషం కక్కుతోందని ఎమ్మెల్యే శ్యాంబాబు అన్నారు. బుధవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పరిశీలకుడు ఆదినారాయణతో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించారు.

తప్పుడు ప్రచారంతో  వైసీపీ విషం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్యాంబాబు

ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

పత్తికొండ, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకంపై వైసీపీ తప్పుడు ప్రచారాంతో విషం కక్కుతోందని ఎమ్మెల్యే శ్యాంబాబు అన్నారు. బుధవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పరిశీలకుడు ఆదినారాయణతో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఇచ్చినమాట నిలుపుకున్న సీఎం చంద్రబా బుకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లులు కృతజ్ఞతలు తెలుపుతున్నారని ప్రజల్లో ప్రభుత్వానికి ఆదరణ పెరగడాన్ని చూసి ఓర్వలేని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. రూ.15వేలు ఇస్తామని రూ.13వేలు మాత్రమా ఇచ్చారని మిగిలిన రూ.2వేలు ఏమయ్యాయని ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులకు తమ పాలనలో రూ.2వేలు జగన్‌ జేబులోకి పోయాయా లేక తాడేపల్లి ప్యాలెస్‌కు చేరాయా అన్నది చెప్పాలన్నారు. 2019 ఎన్నికల్లో వైఎస్‌ భారతి ప్రతిఇంటిలో ఇద్దరు పిల్లలకు విద్యాదీవెన ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్క విద్యార్థికే అమలు చేయడం ఎంటి అని ప్రశ్నించారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని ప్రగల్భాలు పలికి 12 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల జీవితాలు నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. సభ్యులు జీవాలు నాయక్‌, వెంకటేశ్వర్లు యాదవ్‌, మనోహర్‌చౌదరి, వెంకటపతి, తిరుపాల్‌నాయుడు, నరసింహదరి పాల్గొన్నారు.

అందరి అమోదంతోనే మిటీలు

నాయకులు, కార్యకర్తల ఆమోదంతోనే నూతన కమిటీలు ఏర్పాటుచేస్తామని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. బుధవారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. పరిశీలకుడు తలారి ఆదినారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్యాంబాబు ఆధ్వర్యంలో మండలాల నాయకులు, కార్యకర్త అబిష్టం మేరకు కమిటీ సభ్యులను నియమిస్తామన్నారు. సభ్యులు జీవాలునాయక్‌, వెంకటేశ్వరయాదవ్‌, రమాకాంత రెడ్డి, కురుబ రామక్రిష్ణ, రామేశ్వరరెడ్డి, సన్గు వెంకట్‌ శివరాజ్‌, రామక్రిష్టుడు తదితరులు ఉన్నారు.

Updated Date - Jun 19 , 2025 | 12:15 AM