వైసీపీవి నీచ రాజకీయాలు
ABN , Publish Date - Oct 09 , 2025 | 11:14 PM
వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతుంటే, ఆ పార్టీ నాయకులు చిల్లర పనులు చేస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అంబేడ్కర్ విగ్రహానికి మంత్రి టీజీ క్షీరాభిషేకం
కర్నూలు అర్బన్ , అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతుంటే, ఆ పార్టీ నాయకులు చిల్లర పనులు చేస్తున్నారని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్న వ్యవహారాలను రాష్ట్ర ప్రజలు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారన్నారు. గురువారం కర్నూలు నగరంలోని పాతబస్టాండ్ సమీంలోని అంబేడ్కర్ విగ్రహనికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో అంబేడ్కర్ విగ్రహాన్ని వైసీపీ నాయకులు ధ్వంసం చేయడం శోచనీయమన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారన్నారు. రాష్ట్రంలో వైసీపీ నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పలు కార్పొరేషన్ల డైరెక్టర్లు సంజీవలక్ష్మి, పోతురాజు రవికుమార్, ధరూర్ జేమ్స్, జనసేన అర్షద్, కూటమి నాయకులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో వైసీపీ కుట్రలు
టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి
కర్నూలు అర్బన్ , అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం, కులాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు వైసీపీ నాయకులు కుట్రలు చేస్తున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆరోపించారు. గురువారం పాత బస్టాండ్ సమీపంలోని అంబేడ్కర్ విగ్రహానికి కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలసి తిక్కారెడ్డి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో అంబేడ్కర్ విగ్రహాన్ని వైసీపీ నాయకులు ధ్వంసం చేసి దళితులను అవమానించారన్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసి ఆ కుట్రను టీడీపీపై వేసేందుకు కుట్ర చేశారన్నారు. అంబేడ్కర్ విగ్రహంపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సాంస్కృతిక విభాగం జిల్లా అధ్యక్షుడు హనుమంతరావు చౌదరకి, సత్రం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.