Share News

క్వార్టర్స్‌ ముసుగులో వైసీపీ రాజకీయాలు

ABN , Publish Date - Sep 23 , 2025 | 11:05 PM

వైసీపీ నాయ కులు క్వార్టర్స్‌ను అడ్డుపెట్టుకుని కుట్ర రాజకీయాలకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు.

క్వార్టర్స్‌ ముసుగులో వైసీపీ రాజకీయాలు
ప్రభుత్వ క్వార్టర్స్‌ను పరిశీలించిన కుడా చైర్మన్‌ సోమిశెట్టి

మంత్రిపై నిందలు వేస్తే సహించం

కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు

కర్నూలు అర్బన్‌, సెప్టెంబరు 23(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయ కులు క్వార్టర్స్‌ను అడ్డుపెట్టుకుని కుట్ర రాజకీయాలకు పాల్పడితే తగిన బుద్ధి చెబుతామని కుడా చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. మంగళవారం నగరంలోని ఏ, బీ, సీ క్వార్టర్స్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా సోమిశెట్టి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు హామీ మేరకు కర్నూలు సిటీని స్మార్ట్‌ సిటీ మారుస్తామన్నారు. ఈ ప్రక్రియలో వంద ఎకరాల్లో ఏ, బీ, సీ క్వార్టర్స్‌ స్థలాన్ని ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకుంటే మంత్రిపై ఆపాదించి.. నిందలు వేస్తారా? అంటూ మండిపడ్డారు. మంత్రిపై నిందలు వేస్తే సహించమన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు కుట్ర రాజకీయాలు మాని కర్నూలు అభివృద్ధికి సహకరించాలని కోరారు.

Updated Date - Sep 23 , 2025 | 11:05 PM