వైసీపీ నాయకులు డ్రామాలు ఆపాలి
ABN , Publish Date - Sep 08 , 2025 | 11:42 PM
వైసీపీ నాయకులు డ్రామాలు ఆపాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ధ్వజమెత్తారు.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ధ్వజం
కర్నూలు అర్బన్, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): వైసీపీ నాయకులు డ్రామాలు ఆపాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ధ్వజమెత్తారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖరరెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. తిక్కారెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి మోసపూరిత వాగ్దానాలు నమ్మి ప్రజలు ఒక్క అవకాశం ఇస్తే రాష్ట్రా న్ని అన్నివిధాలుగా సర్వనాశనం చేశారని మండిపడ్డారు. కోడుమూరు నియోజవర్గం సి. బెళగళ్‌లో మద్యం తాగితే వైసీపీ నాయకులు పురుగల మందు తాగినట్టు నాటకాలు గుర్తించామని చెప్పారు. సెల్ఫీ తీయించి 108కు ఫోన్ చేయించి, సోషల్ మీడియాలో ప్రచారం చేయించారని, తీరా ఆసుపత్రిలో వైద్యులు పురుగుల మందు సేవించ లేదని నిర్ధారణరణ అయిందని చెప్పారు. ఇలాంటి నాటకాలతో ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే వారి ఆటలు కట్టిస్తామన్నారు. ఉల్లిరైతుల బాధలు తెలుసుకున్న ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటోందని, అయితే వైసీపీ శవరాజకీయాలు చే యడం మానుకోవాలని అన్నారు. మరోవైపు యూరియా కొరత సృ ష్టించడానికి కూడా తెడబడడం దుర్మార్గమైన చర్య అన్నారు. కోడుమూరు నియోజకవర్గంలో పొగాకు రైతులకు ఇబ్బందులు ఎదురైతే ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, కేడీసీసీబీ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కలెక్టర్‌ను కలిసి పొగాకును కొనుగోలు చేయించారన్నారు. ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడానికి ముందుకు వస్తుంటే వైసీపీ మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మండిపడ్డారు. సమావేశంలో వాల్మీ కి ఫెడరేషన్ డైరెక్టర్ సంజీవలక్ష్మి, బేతం క్రిష్ణుడు, కేవీ సుబ్బారెడ్డి, వి. హనుమంతరావు చౌదరి, రాజు, షేక్షావలి తదితరులు పాల్గొన్నారు.