వైసీపీకి విష ప్రచారం తగదు
ABN , Publish Date - Jun 18 , 2025 | 12:05 AM
తల్లికి వందనం పథకంపై వైసీపీ నాయకుల విష ప్రచారం తగదని ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
అసెంబ్లీకి వెళ్లకుండానే జీతభత్యాలు తీసుకుంటున్న ఎమ్మెల్యే విరుపాక్షి
హామీ నిలబెట్టుకున్న టీడీపీ ప్రభుత్వం : టీడీపీ ఇన్‌చార్జి వీరభద్ర గౌడ్
ఆలూరు, జూన్17(ఆంధ్రజ్యోతి): తల్లికి వందనం పథకంపై వైసీపీ నాయకుల విష ప్రచారం తగదని ఆలూరు టీడీపీ ఇన్‌చార్జి వీరభద్రగౌడ్ అన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి పేరిట రూ.5వేల కోట్లు ఇస్తే టీడీపీ ప్రభుత్వం రూ.10వేల కోట్లు ఇచ్చిందన్నారు. విద్యారంగ గౌరవం పెంచేలా మంత్రి లోకేష్ కృషి అభినందనీయమన్నారు. ఇంత చేస్తున్నా ప్రభుత్వంపై బురదజల్లడం జగన్‌కు తగదన్నారు. ఎమ్మెల్యే విరుపాక్షి జీతభత్యాలు ఎలా తీసుకుంటు న్నారని ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమం టీడీపీ ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఏబీసీ డీసీ చైర్మన్ నగరడోణ కిష్టప్ప, సాలిసాహెబ్, తిమ్మయ్య, మేకల రంగనాథ్, సర్పంచ్‌లు భాస్కర్, మల్లికార్జున, కిట్టు, అంజిరెడ్డి పాల్గొన్నారు.