Share News

యాగంటి హుండీ ఆదాయం రూ.29.6 లక్షలు

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:47 PM

జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి క్షేత్రానికి హుండీ ద్వారా రూ.29.60 లక్షల ఆదాయంతో పాటు 35 గ్రాముల బంగారు, 160 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ పాండురంగారెడ్డి, సోమవారం తెలిపారు.

యాగంటి హుండీ ఆదాయం రూ.29.6 లక్షలు
హుండీ ఆదాయాన్ని లెక్కిస్తున్న భక్తులు

బనగానపల్లె, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటి క్షేత్రానికి హుండీ ద్వారా రూ.29.60 లక్షల ఆదాయంతో పాటు 35 గ్రాముల బంగారు, 160 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్లు ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ పాండురంగారెడ్డి, సోమవారం తెలిపారు. 80 రోజులకు సంబంధించి ఈ ఆదాయం లభించినట్లు తెలిపారు. వెలుగోడు గ్రూపు దేవదాయశాఖ అధికారి జనార్దన్‌ సమక్షంలో హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు తెలిపారు. శ్రీరామ సమితి సేవకులు, భక్తులు, యాగంటిపల్లె ఉపసర్పంచ్‌ బండి మౌళీశ్వరరెడ్డి, భరతుడు, శ్రీరాములు, రామశేఖర్‌, ఆలయ, ఏపీజీబీ సిబ్బంది హుండీ లెక్కింపులో పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2025 | 11:47 PM