కంకరదారులు
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:26 AM
నగర పరిధిలోనే కంకర దారులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కల్లూరు అర్బన్ 21వ వార్డులోని మహాలక్ష్మీనగర్, డాక్టర్స్ కాలనీ దారులు నరకప్రాయంగా మారాయి
కల్లూరు అర్బన్ 21వ వార్డు పరిధిలో కాలనీవాసుల అవస్థలు
కల్లూరు, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నగర పరిధిలోనే కంకర దారులు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కల్లూరు అర్బన్ 21వ వార్డులోని మహాలక్ష్మీనగర్, డాక్టర్స్ కాలనీ దారులు నరకప్రాయంగా మారాయి. మట్టిరోడ్లపై కంకర వేసి వదిలేయడంతో ప్రజలు నడవానికి కూడా ఇబ్బందిగా మాకింది, డాక్టర్స్‌కాలనీలోని భాష్యం స్కూల్, ఎన్‌సీసీ ప్రధాన కార్యాలయం, బీసి బాలుర హాస్టల్ ముందు దారి ఇలాగే ఉంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి నూతన రహదారులను నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు.