నరకదారులు
ABN , Publish Date - Apr 12 , 2025 | 12:17 AM
ఆదోని-హొళగుంద రోడ్డు నరకానికి దారిగా మారంది. ఈ దారిలో ప్రయాణించాలంటేనే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆదోని, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): ఆదోని-హొళగుంద రోడ్డు నరకానికి దారిగా మారంది. ఈ దారిలో ప్రయాణించాలంటేనే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదోని నుంచి హొళగుందకు 26కి.మీ దూరం ఉంది. అయితే ఈ రోడ్డుపై ప్రయాణిచాంలటే రెండు గంటలకు పైగానే ప్రయాణించాల్సి వస్తోంది. ఓసారి ఈ రోడ్డుపై వస్తే మరోసారి వచ్చే సాహసం చేయరని స్థానికులు అంటున్నారు. రహదారిపై మోకాళ్ల లోతు గుంతలు పడ్డాయి. చిన్న వర్షం కురిసినా గుంతల్లో నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది.
అత్యవసరమైతే అంతే..
అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు వెళ్లాలంటే ఇక అంతే. రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణుల అవస్థలు అంతే. రోజూ పాఠశాల, కళాశాలకు వెళ్లే విద్యార్థులు కూడా అవస్థలు పడుతున్నారు. ఈ రోడ్డును భరించలేక మరికొందరు దూరమైనా, ఆలూరు మీదుగా ఆదోనికి చేరుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నూతన రహదారి నిర్మించాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
ఆదోనికి వెళ్లాలంటే నరకమే..
హొళగుంద నుంచి ఆదోనికి వెళ్లాలంటే నరకం కని పిస్తోంది. డాణపురం గ్రామం వరకు వెళ్లాలన్నా కష్టం. మెకాళ్ల లోతు గుంతలు ఉండటంతో వర్షం కురిస్తే ఇక అంతే. - చాకలి నాగరాజు, హొళగుంద.
త్వరలో పనులు ప్రారంభం
గత ప్రభుత్వంలో డబుల్ రోడ్డు మంజూరు కాగా, కొన్ని కారణతో రద్దుఅయింది. సింగిల్ రోడ్డుకు ప్రతిపాదనలు పంపాం. టెండర్ ఖరారైతే పనులు ప్రారంభిస్తాం. హొళగుంద నుంచి దణాపురం వరకు 12 ఏళ్ల క్రితం వేశారు సంవత్సరాలుగా రోడ్డుకు మరమ్మతులు చేయలేదు. - సాయిసురేష్, ఎఈఈ, ఆర్‌అండ్‌బీ, ఆదోని