పూజలందుకున్న వినాయకుడు
ABN , Publish Date - Aug 29 , 2025 | 12:22 AM
వినాయక చవితి పర్వదినాన్ని బుధవారం నంద్యాల, నందికొట్కూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో అత్యంత వైభవం గా జరుపుకున్నారు.
వినాయక చవితి పర్వదినాన్ని బుధవారం నంద్యాల, నందికొట్కూరు, ఆత్మకూరు నియోజకవర్గాల్లో అత్యంత వైభవం గా జరుపుకున్నారు. మండపాల్లో గణనాథుని విగ్రహాలను వివిధ ఆకృతుల్లో, రంగుల్లో ప్రతిష్ఠించారు. కటౌట్లను పోటాపోటీగా, శోభాయమానంగా అలంకరించారు. భక్తులకు భోజనాలు, అల్పాహార విందును ఏర్పాటు చేశారు. మండపాల వద్ద భజనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరింపజేశాయి. మండపాల వద్ద ఆదిదేవుడు వినాయకుడిని కలెక్టర్, జేసీ, ఎస్పీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు దర్శించకుని పూజలు చేశారు. అలాగే ఇళ్లలో కూడా వినాయకుని ప్రతిమలను ఉంచి ఇంటిల్లిపాది పూజలు చేశారు. - ఆంధ్రజ్యోతి నెట్‌వర్క్