Share News

జిల్లా కోర్టులో వర్క్‌షాప్‌ ప్రారంభం

ABN , Publish Date - Sep 28 , 2025 | 12:30 AM

నేరారోపణల రిమాండ్‌.. జీవిత రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన చట్టాలపై నగరంలోని జిల్లా కోర్టులో శనివారం వర్క్‌షాప్‌ను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భానుమతి ప్రారంభించారు.

జిల్లా కోర్టులో వర్క్‌షాప్‌ ప్రారంభం
ప్రసంగిస్తున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భానుమతి

హాజరైన హైకోర్టు న్యాయమూర్తులు

కర్నూలు లీగల్‌, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): నేరారోపణల రిమాండ్‌.. జీవిత రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన చట్టాలపై నగరంలోని జిల్లా కోర్టులో శనివారం వర్క్‌షాప్‌ను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ భానుమతి ప్రారంభించారు. వ్యక్తిగత స్వేచ్ఛకు, నేరారోపణలపై అరెస్టయి ఖైదీల రిమాండ్‌కు సంబంధించిన ప్రొసీజర్లపై ఈ వర్క్‌షాప్‌ నిర్వహించారు. న్యాయాధికారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన ప్రొసీజర్లపై హైకోర్టు న్యాయమూర్తి జిల్లాలోని న్యాయాధికారులకు వివరించారు. కార్యక్రమంలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హరిహరనాథ శర్మ, కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి.కబర్ది, న్యాయాధికారులు లక్ష్మీరాజ్యం, శ్రీవిద్య, ఎం.శోభారాణి, రాజేంద్రబాబు, శాశ్వత లోక్‌ అదాలత్‌ అధ్యక్షుడు వెంకట హరినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2025 | 12:30 AM