రాష్ర్టాభివృద్ధికి అహర్నిశలు కృషి
ABN , Publish Date - Oct 17 , 2025 | 11:09 PM
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ర్టాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావు అన్నారు.
డబుల్ ఇంజన్ సర్కార్ చేతల ప్రభుత్వం
కూటమి నాయకుల సమన్వయంతో సభ విజయవంతం
టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు
ఇండ స్ట్రియల్ హబ్‌కు రూ.10 వేల కోట్లు
ఫేక్ ప్రచారాలతో వైసీపీ రాజకీయం
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్
కర్నూలు అర్బన్ , అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ర్టాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌రావు అన్నారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి టీజీ భరత్ , జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లుతో సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కార్ చేతల ప్రభుత్వమన్నారు. ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ కార్యక్ర మాన్ని విజయవంతం చేయడానికి కూటమి నాయకులు సమన్వయంతో పని చేశారన్నారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ మోదీ సభ ఏర్పా టుల్లో కలెక్టర్, ఎస్పీ కృషి అభినందనీయమన్నారు. చరిత్రలో ఎన్నడు లేని విధంగా ప్రపంచం మొత్తం కర్నూలు వైపు చూసే విధంగా మోదీ నిధులు ప్రకటించారని, కర్నూలు ఇండ స్ట్రియల్ హబ్‌కు రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఇప్పటికే అవసరమైన ప్రక్రియ పూర్తయిందన్నారు. వైసీపీ ఫేక్ ప్రచారాలతో రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా ఎయిర్ పోర్టులో ఆయన్ను కలిసి మెడికల్ కళాశాలల విషయంలో వినతి పత్రం ఇచ్చారని ఫేక్ ప్రచారం చేస్తోందన్నారు. ఈ సమావేశంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, బొగ్గుల దస్తగిరి, జనసేన జిల్లా అధ్యక్షుడు సురేష్, డీసీఎంఎస్ చైర్మన్ వై. నాగేశ్వరరావుయాదవ్, ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి, అకెపొగు ప్రభాకర్, నాయ కులు, హ జరయ్యారు.