Share News

మహిళల భద్రతకు కృషి

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:19 PM

మహిళల భద్రత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ తెలిపారు.

మహిళల భద్రతకు కృషి
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న అతిథులు

రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): మహిళల భద్రత కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ తెలిపారు. మంగళవారం దూపాడు శివారులో ఉన్న అశోక ఉమెన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో మహిళల సంక్షేమం, భద్రత, హక్కులపై జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మహిళల హక్కులను కాపాడటానికి మహిళల రక్షణ, సంక్షేమానికి వివిధ రకాల హింస, దారుణాలను నివారించడానికి మహిళా కమిషన్‌ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చట్టాలు రూపొందించిందని, వాటిపై మహిళలు సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మహిళలు, యువతులు ఎక్కువగా మోసపూరిత మాటలు, సోషల్‌ మీడియాకు ప్రభావితులై సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోసపూరిత మాటలు, సోషల్‌ మీడియాకు లోను కాకుండా విద్యార్థినులు చదువుకుని జీవితంలో ఉన్నతంగా రాణించాలన్నారు. సోషల్‌ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు షేర్‌ చేయ కూడదని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, ఐసీడీఎస్‌ పీడీ నిర్మల, లోకల్‌ కంప్లయింట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ మాధవి శ్యామల, కార్పొరేటర్‌ కైప పద్మలతరెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిటీ సభ్యులు మాలతి, మహిళా పోలీస్‌ స్టేషన్‌ సీఐ విజయలక్ష్మి, ప్రొఫెసర్‌ సునీత, విద్యార్థినులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 11:19 PM