Share News

మైనార్టీల సంక్షేమానికి కృషి

ABN , Publish Date - Nov 14 , 2025 | 11:25 PM

ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ ముస్లిం మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్‌ అహమ్మద్‌ అన్నారు.

మైనార్టీల సంక్షేమానికి కృషి
భారీ చెక్కును విడుదల చేస్తున్న మౌలానా షేక్‌ ముస్తాక్‌ అహమ్మద్‌

ఇమామ్‌, మౌజన్ల వేతనాలకు రూ.90 కోట్లు

ముస్లిం మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ముస్తాక్‌ అహమ్మద్‌

ఆదోని, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): ముస్లిం మైనార్టీల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఏపీ ముస్లిం మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, టీడీపీ మైనార్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు ముస్తాక్‌ అహమ్మద్‌ అన్నారు. శుక్రవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ముస్లిం మైనార్టీల సమావేశం టీడీపీ సీనియర్‌ నాయకుడు ఉమాపతినాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మైనార్టీలకు ఇచ్చిన వాగ్దానాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిలబెట్టుకుందన్నారు. రాష్ట్రంలో ఇమామ్‌, మౌజన్లకు 12నెలల గౌరవ వేతనాల కోసం రూ.90కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసిందన్నారు. అభివృద్ధి అంటేనే చంద్రబాబునాయుడు అని పే ర్కొంటూ, ఆయన మైనార్టీల పక్షపాతి అని కొనియాడారు. ఉమ్మడి జిల్లాలోని ఇమామ్‌, మౌజన్ల గౌరవ వేతనానికి సంబంధించిన రూ.14.36 కోట్లు భారీ చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఏపీ కురువ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవేంద్రప్ప, హౌసింగ్‌ డైరెక్టర్‌ రామకృష్ణ, మండల అధ్యక్షుడు తిమ్మప్ప, శివప్ప, నాయకులు సాధికాబేగం, అప్సర్‌బాషా, అల్తా్‌ఫఉసేన్‌, హనువాలు బాషా, అరీఫ్‌, జాఫర్‌, బండి మాబాష, ఎగ్బాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2025 | 11:25 PM