Share News

కార్మికుల ధర్నా టెంట్‌ తొలగింపు

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:01 AM

వేతనాలు పెంచాలని కోరుతూ గత 60 రోజులుగా కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న నగరపాలక పరిధిలోని ఇంజనీరింగ్‌ కార్మికుల టెంట్‌ను బుధవారం అర్థరాత్రి అధికారులు తొలగించారు.

కార్మికుల ధర్నా టెంట్‌ తొలగింపు
ఆందోళన చేస్తున్న కార్మికులు

నగర పాలక కార్యాలయం ఎదుట ఆందోళన

కర్నూలు న్యూసిటీ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): వేతనాలు పెంచాలని కోరుతూ గత 60 రోజులుగా కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న నగరపాలక పరిధిలోని ఇంజనీరింగ్‌ కార్మికుల టెంట్‌ను బుధవారం అర్థరాత్రి అధికారులు తొలగించారు. దీంతో కార్మికులు పెద్ద ఎత్తున అధికారులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నగరపాలక కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. కార్యాల యంలోకి ఎవ్వరినీ వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. కమిషనర్‌ కూడా తన నివాసంలోని క్యాంపు కార్యాలయం నుంచే ఆఫీసు వ్యవహారం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి సమీర్‌బాషా, ఉపాధ్యక్షుడు నాగశేషులు, నగర అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కార్యదర్శి యాసిన్‌బేగ్‌, గంగమ్మ పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:01 AM