Share News

కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలి

ABN , Publish Date - Jul 17 , 2025 | 01:09 AM

కార్మికులు పోరాటలకు సి ద్ధం కావాలని సీఐ టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వి.నాగేశ్వ రరావు పిలుపునిచ్చారు.

కార్మికులు పోరాటాలకు సిద్ధం కావాలి
మాట్లాడుతున్న నాగేశ్వరరావు

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు

కర్నూలు న్యూసిటీ, జూలై 16(ఆంధ్రజ్యోతి): కార్మికులు పోరాటలకు సి ద్ధం కావాలని సీఐ టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వి.నాగేశ్వ రరావు పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షుడు పీఎస్‌. రాధాక్రిష్ణ అధ్యక్ష తన బుధవారం కేకే భవనలో సీఐటీయూ జిల్లా కార్యకర్తల వర్క్‌షాపు నిర్వహించారు. నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మోదీ విధానాలను దొడ్డిదారిన అమలు చేయడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. విద్యుత రంగంలో తీసుకువ చ్చిన మార్పులకు అనుగుణంగా స్మార్ట్‌ మీటర్లను బిగించే ప్రయత్నం చేస్తుం దన్నారు. రాష్ట్ర కార్యదర్శి ముజుఫర్‌ అహ్మద్‌ మాట్లాడుతూ సీఐటీయూ ఆల్‌ ఇండియా మహాసభలు విశాఖపట్టణంలో డిసెంబరు 31 నుంచి 2026 జనవరి 4 వరకు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్‌ పి.నిర్మల, జిల్లా కార్యదర్శివర్గసభ్యులు సీహెచ.సాయిబాబా, విజయ్‌, నారాయణ స్వామి, ప్రభాకర్‌, గోపాల్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 01:09 AM