Share News

రాయల్టీ సమస్యతో రోడ్డున పడ్డ కార్మికులు

ABN , Publish Date - Oct 23 , 2025 | 11:51 PM

రాయల్టీ వసూలు ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో గని కార్మికులు రోడ్డున పడే పరి స్థితి నెలకొందని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు అన్నారు.

రాయల్టీ సమస్యతో రోడ్డున పడ్డ కార్మికులు
మాట్లాడుతున్న రంగనాయుడు

సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు

కొలిమిగుండ్ల, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): రాయల్టీ వసూలు ప్రైవేటు సంస్థకు అప్పగించడంతో గని కార్మికులు రోడ్డున పడే పరి స్థితి నెలకొందని సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రంగనాయుడు అన్నారు. గురువారం కొలిమిగుండ్ల మండలంలోని నాపరాళ్ల గనుల్లో పర్యటించి, గనుల యజమానులు, కార్మికులతో మాట్లాడారు. జిల్లా లోని కొలిమిగుండ్ల, అవుకు, బనగానపల్లె, బేతంచెర్ల తదితర ప్రాం తాల్లో వేలాది మంది కార్మికులు నాపరాళ్ల గనుల ఆధారంగా జీవనం సాగిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు సంజీవులు, నాగాంజనేయులు, సూరి, మహేష్‌, రైతు సంఘం నాయకులు పుల్లయ్య, బాబు పాల్గొన్నారు.

Updated Date - Oct 23 , 2025 | 11:51 PM