గ్రామీణ వైద్యుల గుర్తింపునకు కృషి చేస్తా
ABN , Publish Date - Jul 17 , 2025 | 12:41 AM
గ్రామీణ వైద్యుల గుర్తింపునకు కృషి చేస్తాననని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఏపీ గ్రామీణ వైద్యుల సంక్షేమం సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు టీడీ జనార్దన్ అన్నారు.
మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దన్
గ్రామీణ వైద్యులపై అపారమైన నమ్మకం: మంత్రి టీజీ భరత్
ప్రభుత్వం వీరికి శిక్షణ ఇవ్వాలి : కేజీ గోవిందరెడ్డి
కర్నూలు హాస్పిటల్, జూలై 16 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ వైద్యుల గుర్తింపునకు కృషి చేస్తాననని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, ఏపీ గ్రామీణ వైద్యుల సంక్షేమం సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు టీడీ జనార్దన్ అన్నారు. బుధవారం నగరంలోని జిల్లా రైల్వేగేటు పక్కన ఉన్న శ్రీలక్ష్మి కల్యాణ మండపంలో ఉమ్మడి జిల్లా గ్రామీణ వైద్యుల మహాసభ డా.కేజీ గోవిందరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీ జనార్దన్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యుల సేవలు చాలా ఉపయోగపడుతాయని, వారి సేవలను వినియోగించుకునేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ గ్రామీణ వైద్యులపైన అపారమైన నమ్మకం ఉందని అన్నారు. వీరి సేవలను ప్రభుత్వం వినియోగించుకునేలా కృషి చేస్తానన్నారు. కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ తాను అనారోగ్యానికి గురైతే ఆర్‌ఎంపీ వైద్యులతోనే వైద్యం చేయించుకుంటానన్నారు. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా గౌరవాధ్యక్షుడు కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 60 శాతం మంది గ్రామీణ వైద్యులు ప్రజలకు సేవలు అందిస్తున్నా రన్నారు. ప్రభుత్వం పారామెడికల్ బోర్డులో రిజిస్ర్టేషన్ ఇచ్చిన ప్రభుత్వం వీరికి శిక్షణ ఇవ్వాలని కోరారు. దేశ వ్యాప్తంగా గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కారానికి సహకరిస్తాన న్నారు. కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాధాకృష్ణ, కార్యదర్శి ఎంఎన్ రాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి దస్తగిరి, కర్నూలు, నంద్యాల జిల్లా అధ్యక్షులు గార్గేయపురం శ్రీనివాసులు, నాగేశ్వరరెడి ్డ, కర్నూలు జిల్లా సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి రఘునాథరెడ్డి, జిల్లా నాకులు ఇల్లూరి నరసింహ, నంద్యాల జిల్లా నాయకులు నాగేశ్వరరావు, సెక్రటరీ సురేష్‌బాబు పాల్గొన్నారు.