Share News

ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయండి

ABN , Publish Date - Sep 26 , 2025 | 11:18 PM

బస్సులను కండీషన్‌గా ఉంచుకుని ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయాలని ఎండీ సీహెచ్‌ ద్వారక తిరుమలరావు ఉద్యోగులు, సిబ్బందికి పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల జిల్లా డోన్‌ ఆర్టీసీ బస్టాండును ఆయన పరిశీలించారు.

ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయండి
ప్రయాణికులతో మాట్లాడుతున్న ద్వారక తిరుమలరావు

ఎండీ సీహెచ్‌ ద్వారక తిరుమలరావు

డోన్‌ టౌన్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): బస్సులను కండీషన్‌గా ఉంచుకుని ఆర్టీసీ అభివృద్ధికి కృషి చేయాలని ఎండీ సీహెచ్‌ ద్వారక తిరుమలరావు ఉద్యోగులు, సిబ్బందికి పిలుపునిచ్చారు. శుక్రవారం నంద్యాల జిల్లా డోన్‌ ఆర్టీసీ బస్టాండును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ‘స్త్రీ శక్తి’పై మహిళా ప్రయాణికులతో ఆయన మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అనం తరం ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్‌ ఎం.శశిభూషణ్‌ ఆధ్వర్యంలో ఉద్యోగుల అభినందన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ రాష్ట్రంలో 1,050 కొత్త ఎలక్ట్రికల్‌ బస్సులను అందుబాటులోకి తెస్తున్నట్లు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారక తిరుమల రావు వెల్లడించారు. ఆర్టీసీ ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆయన చెప్పారు. అనంతరం ఆదర్శ ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ప్రశంసాపత్రాలు పొందిన వారిలో కండక్టర్లు కె.శ్రీనివాసులు, ఎస్‌.రాముడు, ఆర్‌.ఓబులపతి, మెకానిక్‌ ఎస్‌.సుబ్బరాయుడు, కోచ్‌ బిల్డర్‌ ఎం.శేఖర్‌, గ్యారేజ్‌ సూపర్‌వైజర్‌ వై.గోపాల్‌ ఉన్నారు.

డోన్‌కు విచ్చేసిన ఏపీ ఆర్టీసీ ఎండీ సీహెచ్‌ ద్వారక తిరుమల్‌రావు ఏపీ పీటీడీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులు వినతి పత్రం అందజేశారు. ఆర్‌పీజీ 22, ఏఏఎస్‌, ఫే ఫిక్సేషన్‌ ఎఫ్‌ఆర్‌కు విరుద్ధంగా కొంత మంది సిబ్బందిపై జీతం నుంచి రికవరి చేయడం నిలుపుదల చేసి న్యాయం చేయాలని ఎంప్లాయీస్‌ యూనియన్‌ నాయకులు ఆర్టీసీ ఎండీకి వినతిపత్రం అందజేశారు. 2022 నుంచి 2024 వరకు ఉన్న నైట్‌ఫుట్‌ అలవెన్స్‌ బకాయిలను ఇప్పించి అర్హులకు ప్రమోషన్లు కల్పించాలని కోరారు.

Updated Date - Sep 26 , 2025 | 11:18 PM