Share News

పాఠశాల అభివృద్ధికి తోడ్పడండి : డీఈవో

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:06 AM

పాఠశాలల అభివృద్ధికి తోడ్పడాలని డీఈవో శ్యామ్యూల్‌పాల్‌ కోరారు. ఆదివారం ఇబ్రహీం ఫంక్షన్‌ హాల్‌లో ఆలూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల-1, 2లో 2000-2001 పదో తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు.

పాఠశాల అభివృద్ధికి తోడ్పడండి : డీఈవో
ఆదోని నెహ్రూ స్మారక ఉన్నత పాఠశాల 1991-92 బ్యాచ్‌ విద్యార్థులు

ఆలూరు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): పాఠశాలల అభివృద్ధికి తోడ్పడాలని డీఈవో శ్యామ్యూల్‌పాల్‌ కోరారు. ఆదివారం ఇబ్రహీం ఫంక్షన్‌ హాల్‌లో ఆలూరు ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల-1, 2లో 2000-2001 పదో తరగతి బ్యాచ్‌ పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. 25 ఏళ్ల అంనతరం తమ మిత్రులను కలిసి ఆనందంగా గడిపారు. ఆనాడు చదువు చెప్పిన ఉపాధ్యాయులను సన్మానించారు. ఆదోని ఎంఈవో భూపాల్‌రెడ్డి, వాల్మీకి కార్పొరేషన్‌ డైరెక్టర్‌ మంజునాథ్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ నరసయ్య, విశ్రాంత ఉపాధ్యాయులు రుక్మిణి, రమణయ్య, పవన్‌కుమార్‌, జేమ్స్‌, సత్యమూర్తి, లక్ష్మన్న, నీలకంఠప్ప పాల్గొన్నారు.

33 ఏళ్ల అనంతరం కలిశారు

ఆదోని అగ్రికల్చర్‌: పట్టణంలోని ఎన్‌ఎంహెచ్‌ఎస్‌ పాఠశాల 1991-92 బ్యాచ్‌ పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆదివారం కలుసుకున్నారు. 33 ఏళ్ల తర్వాత తమ స్నేహితులను చూసి ఆనందించారు. నాడు తరగతి గదిలో అల్లర్లు, మైదానంలో ఆడిన ఆటలను గుర్తు చేసుకుని సాయంత్రం వరకు అక్కడే గడిపారు. ఉపాధాయులను సన్మానించారు. అనంతరం పాఠశాలకు అవసరమైన స్టేజీను సొంత ఖర్చులతో నిర్మించి ఆంకితం చేశారు. నాటి ఉపాధ్యాయుడు రామకృష్ణ హెచ్‌ఎం ఫయాజ్‌, సునీల్‌, వరప్రసాద్‌ను సన్మానించారు. పూర్వ విద్యార్థులు మంగమ్మ, కళావతి, శ్రీను, హరి, అమర్‌ ప్రకాష్‌, కృష్ణా, ప్రకా్‌, విజయ, జమీర్‌, సత్య విజయహరి పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2025 | 12:06 AM