Share News

అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Oct 09 , 2025 | 12:39 AM

నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అన్నారు.

అభివృద్ధికి కృషి
మాట్లాడుతున్న టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి

వర్గాలకు తావులేకుండా ఏకతాటిపై నడిపిస్తా

వైసీపీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదు

టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి

ఆలూరు, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి వైకుంఠం జ్యోతి అన్నారు. బుధవారం పట్టణంలోని ఇబ్రహీం ఫంక్షన్‌హాలులో టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్‌ కార్యదర్శి వైకుంఠం శివప్రసాద్‌ అధ్యక్షతన నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశానికి రాయలసీమ రీజనల్‌ కోఆర్డినేటర్‌ బీద రవిచంద్రయాదవ్‌, ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి, పత్తికొండ ఎమ్మల్యే కేఈ శ్యాంబాబు, వాల్మీకి కార్పొరేషన్‌ చైర్మన్‌ బుజ్జమ్మ, డీసీఎం ఎస్‌ చైర్మన్‌ నాగేశ్వర్‌యాదవ్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీడీపీలో వర్గాలకు తావు లేకుండా పార్టీని ఏకతాటిపైకి నడిపిస్తామన్నారు. రహదారులు, తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతిపక్ష హోదా లేని వైసీపీ ఎమ్మెల్యే లు ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదన్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరుపాక్షి ఉల్లి రైతులతో చేసిన యాక్షన్‌ ప్రజలకు తెలుసున్నారు. తనకు టీడీపీ ఇన్‌చార్జిగా నియమించిన సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌, రాయలసీమ రీజనల్‌ కోఆర్డినేటర్‌ బీద రవిచంద్రయాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్‌యార్డు చైర్మన్‌ బిల్లేకల్‌ వెంకటేష్‌, ఆలూరు పరిశీలకులు గంజి నాగరాజు, ఆలూరు బ్రాంచ్‌ కెనాల్‌ డీసీ అధ్యక్షులు నగరడోణ కిష్టప్ప, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌ కురువ జయరాం, మాజీ ఎంపీపీ రామచంద్రనాయుడు, మండల కన్వీనర్లు అశోక్‌, వల్లి, విజయ్‌, పరమరెడ్డి, సుధాకర్‌, తిప్పయ్య, సీనియర్‌ నాయకులు వెంకటే్‌షచౌదరి, విష్ణువర్ధన్రెడ్డి, ఎల్లార్తి మల్లి, శివప్రకాష్‌, రుఘుబాబు, కటారి కొండ శీనప్ప, కృష్ణయాదవ్‌, ఉచ్చీరప్ప, బెలగంటి హనుమప్ప, కృష్ణంనాయుడు, వీరసేన రెడ్డి, నరసప్ప, సంజన్న, మేకల రంగనాథ్‌, సతీష్‌, బెంగళూరు కిషోర్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 12:39 AM