Share News

సమస్యల పరిష్కారానికి కృషి చేయండి : చైర్మన

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:17 AM

ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నగర పంచాయతీ చైర్మన చలం రెడ్డి వార్డు కౌన్సిలర్లు, అధికారులకు సూచించారు.

 సమస్యల పరిష్కారానికి కృషి చేయండి : చైర్మన
మాట్లాడుతున్న నగర పంచాయతీ చైర్మన

బేతంచెర్ల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నగర పంచాయతీ చైర్మన చలం రెడ్డి వార్డు కౌన్సిలర్లు, అధికారులకు సూచించారు. సోమవారం నగర పంచాయతీ కార్యాలయంలో చైర్మన అధ్యక్షతన కౌన్సిల్‌ సమావేశం కమిషనర్‌ హరి ప్రసాద్‌ నిర్వహించారు. ఆయా వార్డుల్లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి కౌన్సిలర్ల ఆమోదం కోసం శానిటైజర్‌ ఇన్సపెక్టర్‌ మధు కుమార్‌ చదివి వినిపించారు. కౌన్సిలర్‌ శకుంతల మాట్లాడుతూ తమ వార్డు పరిధిలో రోడ్లన్నీ పాడయ్యాయని, వాటి మరమ్మతులను చేపట్టాలని కోరారు. కౌన్సిలర్లు మోబినా, మధుకుమార్‌ మాట్లాడుతూ తమ వార్డులో ప్రజలు తాగునీటి సమస్యతో అల్లాడి పోతున్నారని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వారపు సంత రోడ్లపైన జరుగుతుందని, రోడ్లపై వెళ్లేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన కమిషనర్‌ దృష్టికి తెచ్చారు. కౌన్సిలర్‌ నంద్యాల కుమారి మాట్లాడుతూ రక్షిత మంచినీటి పథకం ట్యాంక్‌పైపై కప్పు సరిగా లేక వాటి మరమ్మతులు చేపట్టాలన్నారు. అనంతరం నగర పంచాయతీ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనులు, వాటి ఖర్చులు, జమలు సంబంధించిన బడ్జెట్‌ను ఏఈ తేజేశ్వర్‌ రెడ్డి కౌన్సిలర్లకు చదివి వినిపించారు. కౌన్సిలర్‌ ఇబ్రహీం మాట్లాడుతూ నగర పంచాయితీ పరిధిలో చేపట్టిన 5 అభివృద్ధి పనుల గురించి సభ్యులకు వివరించాలని కోరారు. అభివృద్ధి పనులను త్వరలో పూర్తి చేస్తామని కమిషనర్‌ సమాధానమిచ్చారు. చైర్మన చలం రెడ్డి మాట్లాడుతూ కూరగాయల మార్కెట్‌లు నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని ఉపయోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు సూచించారు. అనంతరం కౌన్సిలర్లకు, కార్యాలయ సిబ్బందికి జూట్‌ బ్యాగులను పంపిణీ చేశారు. కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 12:44 AM