పనులను వేగవంతం చేయాలి
ABN , Publish Date - Nov 19 , 2025 | 12:29 AM
పట్టణంలో చేపట్టిన సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి
బనగానపల్లె, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): పట్టణంలో చేపట్టిన సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. మంగళవారం బనగానపల్లె పట్టణంలో పర్యటించి సీసీ రోడ్లు, అండర్ డ్రైనేజీ పనులను పర్యవేక్షించారు. కూటమి ప్రభుత్వంలో అందుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, స్థానిక సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. జుర్రేరువాగు వద్ద నిర్మిస్తు న్న వాకింగ్ ట్రాక్‌ను పరిశీలించారు. బస్టాండ్ పరిసర ప్రాంతాలను పరిశీలించి బస్సుల రాకపోకలపై మంత్రి ఆరాతీశారు. మంత్రి వెంట డీఈలు నాగశ్రీనివాసులు, మధుసూదన, ఏఈ సాయికృష్ణ, ఉపసర్పంచ బురానుద్దీన, భానుముక్కల సొసైటీ అధ్యక్షుడు అబ్దుల్‌కలాం, రహీంనాయక్, బొబ్బల మద్దిలేటిరెడ్డి, గణమద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.