పనులను వేగవంతంగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Jul 19 , 2025 | 01:10 AM
కల్లూరు అర్బన వార్డులో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి
రూ.2.30 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కల్లూరు, జూలై 18(ఆంధ్రజ్యోతి): కల్లూరు అర్బన వార్డులో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి అన్నారు. శుక్రవారం కల్లూరు అర్బన పరిధిలోని 32, 35, 30, 36, 41 వార్డుల్లో రూ.2.30 కోట్లతో అభివద్ధి పనులకు నగర కమిషనర్ పి.విశ్వనాథ్‌తో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ అర్బన వార్డుల్లోని శివారు ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా చర్యలు తీసుకుంటు న్నామన్నారు. పనులు దక్కిం చుకున్న కాంట్రాక్టర్లు నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఎనక్యాప్ నిధులతో 32, 35వ వార్డుల పరిధిలో చెన్నమ్మసర్కిల్ నుంచి ఏపీఐఐసీ కార్యాలయం వరకు రూ.90లక్షలతో రహదారి విస్తరణ, 36వ వార్డు వై.జంక్షన నుంచి పెద్దపాడు వరకు రూ.25 లక్షలతో డివైడర్లలో పచ్చదనం పెంపు పనులకు శంకుస్థాపన చేశారు. సాధారణ నిధులతో 30వ వార్డులోని సుంకులమ్మగుడి నుంచి హంద్రినది వరకు రూ.49.95 లక్షలతో డిస్పోజబుల్ డ్రైన, 37వ వార్డు శరీననగర్‌లో రూ.50 లక్షలతో సీసీ రోడ్లు, 41వ వార్డు సిద్దార్థహోమ్‌లో రూ.15 లక్షలతో సీసీ డ్రైన నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు కె.పార్వతమ్మ, కల్లూరు అర్బ న వార్డుల ఇనచార్జి పెరుగు పురుషోత్తంరెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, బ్రాహ్మణపల్లె నాగిరెడ్డి, పీయూ మాదన్న, పెద్దపాడు లోకేశ్వరరెడ్డి, ఎన్వీ.రామకృష్ణ, శ్రీనివాసరావు, శైలజాయాదవ్, కార్పొరేటర్ జయరాముడు, ఎస్.ఫిరోజ్, గంగాధర్‌గౌడ్, కేతూరు మధు, నగర పాలక ఇంజనీర్లు పాల్గొన్నారు.