Share News

సమన్వయంతో పని చేయండి

ABN , Publish Date - Oct 09 , 2025 | 11:17 PM

అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్‌ సిరి జిల్లా అధికారులను ఆదేశించారు.

సమన్వయంతో పని చేయండి
మ్యాప్‌ను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే

ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌ సిరి

ఓర్వకల్లు/ కర్నూలు కైం, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్‌ సిరి జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ నెల 16న ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నుంచి గురువారం ఆమె అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ సిరి మాట్లాడుతూ ప్రధాని పార్కింగ్‌ ప్రదేశంలో నన్నూరు టోల్‌గేట్‌ వద్ద కూడా హెల్ప్‌డె్‌స్కలు ఏర్పాటు చేయాలన్నారు. డివైడర్ల వద్ద ప్లాంటేషన్‌ బాగా చేయించాలన్నారు. అనంతరం కలెక్టర్‌ సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌, ఎమ్మెల్యే గౌరు చరిత, నందికొట్కూరు ఇన్‌చార్జి గౌరు వెంకటరెడ్డి తదితరులు సభాస్థలి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ నవ్య, ఏపీ ఇండస్ట్రియల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ రామరాజు, ఆదోని సబ్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌, కర్నూలు ఆర్డీవో సందీప్‌ కుమార్‌, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ విశ్వనాథ్‌, ఇరిగేషన్‌ ఎస్‌ఈ బాలచంద్రారెడ్డి, ఓర్వకల్లు టీడీపీ నాయకులు విశ్వేశ్వరరెడ్డి, నాగేశ్వరరెడ్డి, ఖాజామియా తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2025 | 11:17 PM