కళాశాల అభివృద్ధికి కృషి
ABN , Publish Date - Oct 10 , 2025 | 11:12 PM
సున్నిపెంట ప్రభు త్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ నారాయణ భరత్‌గుప్తా అన్నారు.
విద్యాశాఖ డైరెక్టర్ నారాయణ భరత్ గుప్తా
శ్రీశైలం, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): సున్నిపెంట ప్రభు త్వ డిగ్రీ కళాశాల అభివృద్ధికి కృషి చేస్తానని విద్యా శాఖ డైరెక్టర్ డాక్టర్ నారాయణ భరత్‌గుప్తా అన్నారు. శుక్రవారం ఆయన ఆ కళాశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల మౌలిక వసతులపై, అధ్యాపకులతో, విద్యార్థులతో ఆయన చర్చించారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని తెలిపారు. కళాశాల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట జేసీ విష్ణుచరణ్, తహసీల్దార్ శ్రీనివాసులు ఉన్నారు. కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.పద్మ, అధ్యాపకులు తదితరులు ఉన్నారు.