స్త్రీ శక్తి పథకానికి శ్రీకారం
ABN , Publish Date - Aug 16 , 2025 | 12:19 AM
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘స్త్రీ శక్తి’ పథకాన్ని శుక్రవారం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, జిల్లా కలెక్టరు పి.రంజిత్‌షా, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులు కర్నూలులో లాంఛనంగా ప్రారంభించారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
ప్రారంభించిన ప్రజాప్రతినిధులు, అధికారులు
కర్నూలు, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ‘స్త్రీ శక్తి’ పథకాన్ని శుక్రవారం రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహారశుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, జిల్లా కలెక్టరు పి.రంజిత్‌షా, ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీనివాసులు కర్నూలులో లాంఛనంగా ప్రారంభించారు. మహిళలకు ఉచిత ప్రయాణానికి జీరో ఫేర్ టికెట్ జారీని మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. ఆలూరులో ఎంపీ బస్తిపాటి నాగరాజు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడి, మంత్రాలయంలో ఎమ్మెల్సీ బీటీ నాయుడు ప్రారంభించారు. పత్తికొండలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి, కోడుమూరులో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఆదోనిలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కె.మీనాక్షినాయుడు ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో ఏపీ వాల్మీకి కార్పొరేషన్ చైర్‌పర్సన్ బొజ్జమ్మ, టీడీపీ ఆలూరు ఇన్‌చార్జి బి.వీరభద్రగౌడ్, టీడీపీ సీనియర్ నాయకురాలు వైకుంఠం జ్యోతి, మంత్రాలయం టీడీపీ ఇన్‌చార్జి ఎన్.రాఘవేంద్రరెడ్డి, ఏపీ కురవ కార్పోరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి గుడిసె కృష్ణమ్మ, జనసేన ఇన్‌చార్జి మల్లప్ప తదితరులు పాల్గొన్నారు. కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు, అక్కడి నుంచి బస్టాండ్ వరకు మంత్రి టీజీ భరత్, కలెక్టర్ రంజిత్‌బాషా, ఎమ్మెల్యే గౌరు చరితలు మహిళలతో కలసి బస్సులో ప్రయాణించారు. ఆయా నియోజకవర్గాల్లో కూడా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జిలు మహిళలతో కలసి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. స్త్రీశక్తి బస్సుల వద్ద మహిళలు ఫోటోలు దిగారు. థాంక్యూ సీఎం సర్ అంటూ మహిళలు నినాదాలు చేశారు. జిల్లాలో వివిఽధ డిపోల పరిధిలో 231 పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, అలా్ట్ర పల్లెవెలుగు బస్సుల్లో ఉచిత ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. అందుకు అనుగుణంగా ఆర్‌ఎం శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.