అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు
ABN , Publish Date - Dec 02 , 2025 | 12:27 AM
మహిళలు పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తున్నారని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి
కోవెలకుంట్ల, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): మహిళలు పురుషులతో సమానంగా అన్నిరంగాల్లో రాణిస్తున్నారని ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. కోవెలకుంట్ల పట్టణంతోపాటు మండలంలోని సౌదరి దిన్నె గ్రామంలో మంత్రి బీసీ సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. మంత్రి బీసీ మండలంలోని సౌదరిదెన్నె గ్రామానికి చేరుకోగానే టీడీపీ నాయకులు సుబ్బారెడ్డి, దస్తగిరిలు ఘన స్వాగతం పలికారు. ముందుగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లను ఆయన పంపిణీ చేశారు. అనంతరం ఏపీఎం శేఖర్ ఆధ్వర్యంలో డ్వాక్రా సంఘాల ఆధ్వ ర్యంలో లింగ అసమానతలపై నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి బీసీ పాల్గొని మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారన్నారు. అనంతరం ఏవో సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో సౌదరి దిన్నెలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి బీసీ పాల్గొని రైతుల నుద్దే శించి మాట్లాడారు. అనంతరం పట్టణంలోని జెండా చెట్టుకు సమీపంలో ఉన్న ముస్లిం శ్మాశాన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. శ్మశానంలో మసీదు నిర్మాణం విషయమై ఇరువురి మధ్య సమస్యలు తలెత్తడంతో వాటిని పరిశీలించి సమస్య పరిష్కరిస్తామన్నారు. మధ్యా హ్నం 3గంటలకు కోవెల కుంట్ల గెస్ట్‌హౌస్ చేరుకున్న మంత్రికి కార్యకర్తలతో సమావేశం నిర్వహిం చారు. మండలంలోని పలు గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, కార్యక ర్తలు మంత్రిని కలిసి అర్జీలను అందించారు. మంత్రి అర్జీలను అధికారు లకు ఇచ్చి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కోవెల కుంట్ల సొసైటీ చైర్మన, టీడీపీ నాయకుడు గువ్వల సుబ్బారెడ్డి, బనగాన పల్లె మార్కెట్‌యార్డు చైౖర్మన కాట్రెడ్డి మల్లికార్జునరెడ్డి, ఉమ్మడి జిల్లా మాజీ జిల్లా పరిషత కో ఆప్షన మెంబరు ఎస్‌ఏ గఫూర్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గడ్డం రామక్రిష్ణరెడ్డి, గడ్డం నాగేశ్వర్‌రెడ్డి, వెలగటూరు ధనుంజ యుడు, బిజినవేముల హుసేనయ్య, కంపమల్ల సుబ్బారెడ్డి, అమడాల మద్దిలేటి, వల్లంపాటి సర్పంచ జగదీ శ్వర్‌రెడ్డి, చిన్నకొప్పెర్ల మాజీ సర్పంచ బుచ్చన్న, రేవనూరు ఏవీ సుబ్బారెడ్డి, ఎంపీడీవో వరప్రసాదరావు, డిప్యూటీ ఎంపీడీవో ప్రకాశనాయుడు, తహసీల్దారు పవన కుమార్‌రెడ్డి, ఏవో సుధాకర్‌రెడ్డి, సీఐ హను మంతనాక్, ఎస్సై రమణయ్య పాల్గొన్నారు.