మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:21 AM
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి అన్నారు.
డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి
ఓర్వకల్లు, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని డీఆర్‌డీఏ పీడీ రమణారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని కాల్వ, హుస్సేనాపురం, ఓర్వకల్లు గ్రామాల్లో జరుగుతున్న టైలరింగ్ శిక్షణను ఆయన తనిఖీ చేశారు. కాల్వ గ్రామంలో మగ్గం తయారు చేస్తున్న మహిళలతో మాట్లాడారు. హుసేనాపురం గ్రామంలో కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టైలరింగ్ శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఓర్వకల్లులోని పొదుపులక్ష్మి కార్యాలయంలో ప్రభుత్వ అధ్వర్యంలో జరుగుతున్న టైలరింగ్ శిక్షణా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆయన మా ట్లాడుతూ మండలంలో పొదుపు మహిళలు అన్ని విధాలుగా చైతన్యవం తులు అయ్యారన్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఆయన వెంట పొదుపులక్ష్మి మండల గౌరవ సలహాదారురాలు విజయభారతి, ఎంపీడీఓ శ్రీనివాసులు, సమాఖ్య అధ్యక్షురాలు రత్నమ్మ, సెక్రటరీ సుమతి, డీపీఎంలు నరసమ్మ, హజరత, ఏపీఓ వెంకట రామిరెడ్డి, పొదుపు మహిళలు పాల్గొన్నారు.