Share News

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

ABN , Publish Date - May 23 , 2025 | 12:24 AM

మహిళలు పారిశ్రామికవే త్తలుగా ఎదగాలని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ కేవీ రమణారెడ్డి సూచించారు.

మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
మాట్లాడుతున్న పీడీ రమణారెడ్డి

డీఆర్‌డీఏ పీడీ కేవీ రమణారెడ్డి

వెల్దుర్తి, మే 22(ఆంధ్రజ్యోతి): మహిళలు పారిశ్రామికవే త్తలుగా ఎదగాలని డీఆర్‌డీఏ ప్రాజెక్టు డైరెక్టర్‌ కేవీ రమణారెడ్డి సూచించారు. గురువారం వెల్దుర్తి వెలుగు కార్యాలయంలో పొదుపు మహిళలతో మాట్లాడారు. మహిళలు కుటుంబ అవసరాల కోసం కిచెన్‌ గార్డెన్‌, వర్మికంపోస్టు తయారీతో ఉపాధి పొంది ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నారు. బుక్‌ కీపర్ల ద్వారా రెగ్యులర్‌గా బుకులో నమోదు చేయించాలని, స్ర్తీనిధి రికవరీ మోసాలను అరికట్టేందుకు యూపీఐతో లావాదేవీలు చేయాలని సూచించారు. ఎస్‌బీఐ సౌజన్యంతో పీఎమ్‌ఎఫ్‌ ఎమ్‌ఈ పథకం కింద లక్ష్మీదేవికి మంజూరైన ఆయిల్‌ మిషన్‌ను ప్రారంభించారు. డీపీఎమ్‌లు నర్సమ్మ, నవీన్‌, ఏపీఎమ్‌లు అనురాధ, వెంకటస్వామి, కాశీశ్వరుడు, సీసీలు, ఎంఎంఎస్‌ ఓబీలు, పొదుపు సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - May 23 , 2025 | 12:24 AM