మహిళలు స్వశక్తితో అభివృద్ధి చెందాలి
ABN , Publish Date - Dec 10 , 2025 | 12:17 AM
మహిళలు స్వక్తితో అభివృద్ధి చెందాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా.రాయపాటి శైలజ సూచించారు రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం నగరంలోని సూర్య భవన్ ఆలయం సమీపంలోని శక్తి సదన్‌ను సందర్శించారు
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాయపాటి శైలజ
కర్నూలు హాస్పిటల్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): మహిళలు స్వక్తితో అభివృద్ధి చెందాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ డా.రాయపాటి శైలజ సూచించారు రెండో రోజు పర్యటనలో భాగంగా మంగళవారం నగరంలోని సూర్య భవన్ ఆలయం సమీపంలోని శక్తి సదన్‌ను సందర్శించారు. వసతి గృహంలో ఉన్న వారితో మాట్లాడుతూ అవసరమైన వారికి లీగల్ కౌన్సెలింగ్, సైకాలజికల్ సపోర్టు అందించాలని ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.విజయను ఆదేశించారు. వంటగది, పడకగదులు, చేతిఅల్లిక యూనిట్లు, కుట్టుమిషన్లు శిక్షణ విభాగాలను పరిశీలించారు. మహిళా స్వశక్తికరణలో భాగంగా జన్-ధన్ ఖాతాలో నెలకు ప్రభుత్వం జమచేస్తున్న రూ.500లు డిపాజిట్లు సరైన విదంగా చేరుతున్నాయో లేదా పరిశీలించారు. ఖాతాల వివరాలు అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. వసతి గృహం నుంచి చదివి నలుగురు పోలీసు ఉద్యోగలు, నలుగురు నర్సింగ్, ఐసీడీఎస్ విభాగాల్లో ఉద్యోగాలు సాదించారన్నారు. ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి.విజయ, శక్తి ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి విజయరాజు పాల్గొన్నారు