Share News

తాగునీటి కోసం గళమెత్తిన మహిళలు

ABN , Publish Date - Jul 08 , 2025 | 01:20 AM

పట్టణం లో 15 రోజులుగా తాగునీరు ఇవ్వకపోవతే ఎలా బతకాలని మహిళలు మండిపడ్డారు. సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో స్థానిక పంచాయతీ, తహసీల్దార్‌ కార్యాలయాలను ముట్టఇంచారు.

తాగునీటి కోసం గళమెత్తిన మహిళలు
తహసీల్దార్‌ ఛాంబర్‌లో నిరసన తెలుపుతున్న మహిళలు, నాయకులు

ఖాళీ బిందెలతో ఆలూరు పంచాయతీ, తహసీల్దార్‌ కార్యాలయాల ముట్టడి

ఆలూరు, జూలై 7(ఆంధ్రజ్యోతి): పట్టణం లో 15 రోజులుగా తాగునీరు ఇవ్వకపోవతే ఎలా బతకాలని మహిళలు మండిపడ్డారు. సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో ఖాళీ బిందెలతో స్థానిక పంచాయతీ, తహసీల్దార్‌ కార్యాలయాలను ముట్టఇంచారు. సిద్దేశ్వర కాలనీకి తాగునీరు సరఫరా చేసే పైపులైన్‌కు మూడు కనెక్షన్లు ఇవ్వడంతోనే తమకు నీరు రావడం లేదని సర్పంచ్‌ అరుణదేవిపై మండిపడ్డారు. అనంతరం తహసీల్దార్‌ ఛాంబర్‌లోకి దూసు కెళ్లారు. సీపీఐ నాయకులు రామాంజనేయులు, గోపాల్‌, గౌస్‌, రంగన్న మాట్లాడుతూ బాపురం రిజర్వాయర్‌ వాటర్‌మెన్ల నిర్లక్ష్యంతోనే నీరు సరఫరా కావడం లేదని అధికారులు పట్టించుకోవడం లేదని ఫిర్యాదు చేశారు. సమస్యను పరిష్కరించాలని భారీ ఎత్తున మహిళలు నినాదాలు చేయడంతో తహసీ ల్దార్‌ విజయ్‌కుమార్‌ అధికారులతో చర్చించి, సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు.

Updated Date - Jul 08 , 2025 | 01:20 AM