Share News

జీజీహెచ్‌ను పరిశీలించిన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌

ABN , Publish Date - Jul 23 , 2025 | 12:10 AM

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను మంగళవారం రాత్రి రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ పరిశీలించారు. ఆసుపత్రిలో విభాగాలతో పాటు సఖీ వన్‌స్టాఫ్‌ సెంటర్‌ను చైర్‌పర్సన్‌ సందర్శించారు.

జీజీహెచ్‌ను పరిశీలించిన  మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌
గైనిక్‌వార్డును పరిశీలిస్తున్న చైర్‌పర్సన్‌ డాక్టర్‌ శైలజ

కర్నూలు హాస్పిటల్‌, జూలై 22 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను మంగళవారం రాత్రి రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ రాయపాటి శైలజ పరిశీలించారు. ఆసుపత్రిలో విభాగాలతో పాటు సఖీ వన్‌స్టాఫ్‌ సెంటర్‌ను చైర్‌పర్సన్‌ సందర్శించారు. అక్కడ బాదిత మహిళలతో మాట్లాడి వారి కష్టాలను తెలుసుకుని ఓదార్చారు. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం మహిళల భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మహిళలను ఆదుకోవడంలో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సఖీ వన్‌ స్టాఫ్‌ సెంటర్లను నిర్వహించడం జరుగుతోందన్నారు. బాధిత మహిళలకు మహిళా పోలీస్‌ స్టేషన్‌లో సమన్యాయం చేసుకుని వారిని రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. అనంతరం గైనిక్‌ విభాగాన్ని సందర్శించారు. ఐసీడీఎస్‌ పీడీ నిర్మల, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, అడ్మినిస్ర్టేటర్‌ సింధు సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ శివబాల, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 23 , 2025 | 12:10 AM