మహిళా సంక్షేమమే టీడీపీ ధ్యేయం
ABN , Publish Date - Aug 26 , 2025 | 01:13 AM
మహిళా సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన సూపర్‌సిక్స్ పథకాలను విజయవంతంగా అమలుచేయడంపై సూపర్‌సిక్స్..సూపర్‌హిట్ అంటూ మహిళలతో కలిసి సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.
పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు
పట్టణంలో వేలాది మహిళలతో కలిసి విజయోత్సవ ర్యాలీ
సూపర్ సిక్స్, సూపర్ హిట్ అంటూ మహిళల నినాదాలు
పత్తికొండ, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): మహిళా సంక్షేమమే టీడీపీ ప్రభుత్వ ధ్యేయమని పత్తికొండ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు అన్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన సూపర్‌సిక్స్ పథకాలను విజయవంతంగా అమలుచేయడంపై సూపర్‌సిక్స్..సూపర్‌హిట్ అంటూ మహిళలతో కలిసి సోమవారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. టీటీడీ కళ్యాణమండపం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు సాగిన ఈ ర్యాలీలో వేలాదిమంది మహిళలు పాల్గొని చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు.
అనంతరం అంబేడ్కర్ కూడలిలో ఎమ్మెల్యే శ్యాంబాబు వ మాట్లాడుతూ సూపర్‌సిక్స్ పథకాలను నెరవేర్చి ఇచ్చినమాటకు కట్టుబడ్డ సీఎంగా చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు. ఉచిత గ్యాస్ సిలిండర్, తల్లికి వందనం, స్ర్తీశక్తి పేరిట రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించారన్నారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో చోటుచేసుకున్న నష్టాన్ని భర్తీచేస్తూనే మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీలను ఏడాదిలో చంద్రబాబు నెరవేర్చారని తెలిపారు. ఆయన నాయకత్వంలో రానున్న రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ దేశంలోనే అభివృద్ధి చెందిన రాష్ట్రాల జాబితాలో ముందువరుసలో నిలవనుందని అన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్ రాష్ట్రాబివృద్దికి కృషిచేస్తున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సముచిత న్యాయం చేయ డమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. మహిళలకు ఆస్తిలో వాటా కల్పిస్తూ ఎన్టీఆర్ చట్టం తెచ్చార న్నారు. మహిళల ఆర్థిక సాధికారతకు నాటి ప్రభుత్వంలో సీం చంద్రబాబు పొదుపు సంఘాలను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. మొదటి నుంచి టీడీపీ ఆడ పడుచులకు అండగా నిలుస్తూ, వారి అబివృద్ధి కోసం కృషి చేస్తోందని, ఈరోజు మహిళలు వేలాదిగా తరలివచ్చి విజయో త్సవ ర్యాలీలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మీ ఆదరాబిమానాలు టీడీపీకి ఎప్పుడు ఇలానే ఉండాలని ఆశిస్తున్నామన్నారు. అనంతరం ర్యాలీకి వచ్చిన మహిళలకు స్థానిక డిగ్రీకళాశాల ఆవరణలో భోజనం ఏర్పాటుచేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తుగ్గలి నాగేంద్ర, రామానాయుడు, వెంకటపతి, తిమ్మయ్య చౌదరి, బత్తినిలోక్‌నాథ్, కడవల సుధాకర్, మహిళా నాయకురాళ్లు జానకమ్మ, ఈరమ్మతోపాటు పలువురు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.