మహిళలు అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Nov 26 , 2025 | 12:28 AM
తమ హక్కుల పట్ల మహిళలు అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ.లీలా వెంకట శేషాద్రి సూచించారు
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి
కర్నూలు అర్బన్, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): తమ హక్కుల పట్ల మహిళలు అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బీ.లీలా వెంకట శేషాద్రి సూచించారు. మంగళవారం కేవీఆర్ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవం నిర్వహించారు. ముఖ్య అతిఽథులుగా రాష్ట్ర మహిళా కమిషన్ మెంబర్ రూఖయ్య బేగం హాజర య్యారు. సమాజంలో స్త్రీలు సామాజిక, ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, గృహ హింసలు, స్త్రీలపై ఆత్యాచా రాలు, లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టే ప్రయత్నంలో ఐక్య రాజ్యసమితి ప్రతి సంవత్సరం నవంబరు 25న స్త్రీల హక్కుల పరిరక్షణ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తోందన్నారు. లీగల్ సర్వీసెస్ ఆథారిటి మహిళలకు అండగా ఉంటుందని, న్యాయ సాయం కోసం 15100 టోల్ ప్రీ నెంబరుకు ఫోన్ చేస్తే ఉచిత న్యాయ సహయాన్ని అందించి వారి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. మహిళా కమిషన్ మెంబర్ రూఖయ్య భేగం మాట్లాడుతూ ఉమెన్ హెల్ప్ లైన్ నెంబరు 14490 కాల్ చేస్తే అధికారులు న్యాయ సహయాన్ని అందిస్తారన్నారు. అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ న్యాయవాది సులోచన ఉచిత న్యాయ సేవలు, ఎలా పొందాలో వివరించారు ప్రిన్సిపాల్ డా. కేవీ వెంకటరెడ్డి, రంగారెడ్డి, డా.పద్మావతి పాల్గొన్నారు.