అప్పుడు వద్దని ఇప్పుడు అమర్చుతారా?
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:27 AM
ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి, అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్లను బిగిస్తామని చెప్పడంపై సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్మార్ట్ మీటర్ల ఏర్పాటుపై సీపీఐ నాయకుల ఆగ్రహం
పత్తికొండ టౌన్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించి, అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్లను బిగిస్తామని చెప్పడంపై సీపీఐ కార్యదర్శివర్గ సభ్యుడు రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి గిడ్డయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం అంబేడ్కర్ సర్కిల్ నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని, స్మార్ట్ మీటర్లను బిగిస్తే పగలగొట్టాలని చెప్పిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ అధికారంలోకి వచ్చాక స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తామనడం ఎంతవరకు సమంజసమన్నారు. అనంతరం విద్యుత్ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. వెంకటేశ్వర్‌రెడ్డి, కిరుమంచి, రాజాసాహెబ్, రామాంజనేయులు, గురుదాస్, వెంకటరా మిరెడ్డి, రవిచంద్ర, సిద్ధు, సిద్ధలింగప్ప ఉన్నారు.