Share News

మేం చచ్చాక కాలనీకి వస్తారా...?

ABN , Publish Date - Dec 04 , 2025 | 12:44 AM

మేము చచ్చాక కాలనీకి వస్తారా.. అసలు మా కాలనీని ఎందుకు పట్టించుకోవడం లేద’ని వైద్యులు, పంచాయతీ అధికారులపై కోసిగి 3వ వార్డు వాల్మీకినగర్‌ కాలనీవాసులు ఆగ్రహించారు. బుధవారం వాల్మీకినగర్‌లో బుగేని శ్రీనివాసులు, మహాదేవి, దంపతుల కుమార్తె శ్రీవిద్య (8 నెలలు) డెంగీ బారిన పడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.

మేం చచ్చాక కాలనీకి వస్తారా...?
బాలిక కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న వైద్య సిబ్బంది

వైద్యులపై వాల్మీకి నగర్‌ వాసుల ఆగ్రహం

కాలనీలో రెండు డెంగీ కేసులు నమోదు

కోసిగి, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘మేము చచ్చాక కాలనీకి వస్తారా.. అసలు మా కాలనీని ఎందుకు పట్టించుకోవడం లేద’ని వైద్యులు, పంచాయతీ అధికారులపై కోసిగి 3వ వార్డు వాల్మీకినగర్‌ కాలనీవాసులు ఆగ్రహించారు. బుధవారం వాల్మీకినగర్‌లో బుగేని శ్రీనివాసులు, మహాదేవి, దంపతుల కుమార్తె శ్రీవిద్య (8 నెలలు) డెంగీ బారిన పడి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అదే కాలనీకి చెందిన మరో బాలుడు దేవాన్ష్‌ (16 నెలలు) డెంగీతో ఆదోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే కాలనీకి మొదటిసారి వచ్చిన వైద్యసిబ్బంది, పంచాయతీ సిబ్బందిపై కాలనీ వాసులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఊరి చివర సబ్‌ సెంటర్‌లో ఉండే వైద్యసిబ్బంది కూడా తమ కాలనీ వైపు రాలేదని మండి పడ్డారు. వారానికి ఒకసారి కూడా వైద్యసిబ్బంది కాలనీవైపు చూడడం లేదని కాలనీకి చెందిన మహిళలు గంగమ్మ, గుడిసె లక్ష్మి, నేసే లక్ష్మి, ఈరమ్మ, కోసిగమ్మ తదితరులు మండిపడ్డారు. అలాగే డ్రైనేజీ కాలువలు క్లీన్‌ చేయడం లేదని, దోమలు ఉన్నా ఫాగింగ్‌ చేయడం లేదని, నెలకొకసారి డ్రైనేజీలు శుభ్రపరిచినా కాలువలు తొలగించడం లేదని కాలనీవాసులు వాపోతున్నారు. మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి మంజునాథ్‌, డా.రాజ్‌కిరీటి, వైద్యసిబ్బంది ఈశ్వరమ్మ, రాముడు, సుజాత, మల్లికార్జున, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 12:44 AM