Share News

హాస్టల్‌లో కనీస సౌకర్యాలు కల్పిస్తాం

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:24 AM

హాస్టల్‌లో కనీస సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారత అధికారి ప్రసూన చెప్పారు. కోసిగిలో సంక్షేమ హాస్టళ్లు గజ గజ.. అనే శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది.

హాస్టల్‌లో కనీస సౌకర్యాలు కల్పిస్తాం
విద్యార్థులతో మాట్లాడుతున్న బీసీ సంక్షేమాధికారి ప్రసూన

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్

కోసిగి ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన డీబీసీడబ్ల్యూవో

నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై ఆగ్రహం

కోసిగి, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): హాస్టల్‌లో కనీస సౌకర్యాలు కల్పిస్తామని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ సాధికారత అధికారి ప్రసూన చెప్పారు. కోసిగిలో సంక్షేమ హాస్టళ్లు గజ గజ.. అనే శీర్షికతో శుక్రవారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. రాత్రి 9 గంటల సమయంలో అధికారి ఆకస్మికంగా కోసిగి ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ను తనిఖీ చేశారు. హాస్టల్‌లోని విద్యార్థులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. హాస్టల్‌లో కిటికీలు, దుప్పట్లు లేక ఇబ్బందులుపడు తున్నామని, మెనూ ప్రకారం భోజనం సక్రమంగా పెట్టడం లేదని, నైట్‌వాచ్‌మెన్‌, వార్డెన్‌ సిబ్బంది అందుబాటులో లేరని జిల్లా అధికారిణి ముందు విద్యార్థులు మొర పెట్టుకున్నారు. హాస్టల్‌ వార్డెన్‌, కమాటి, నైట్‌ వాచ్‌మెన్లపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట మాస్టర్లను మార్చి కొత్తవారిని ఏర్పాటు చేస్తామని, ప్రైవేటు వ్యక్తులతో వంట చేయిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాకు 3వేల దుప్పట్లు రావాల్సి ఉందని, త్వరలోనే దుప్పట్లు హాస్టల్‌ విద్యార్థులకు పంపిణీ చేస్తామన్నారు. ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మిగనూరు హాస్టల్‌ వార్డెన్లు విశ్వనాథ్‌ రెడ్డి, హారతి, కోసిగి హాస్టల్‌ వార్డెన్‌ గోపాల్‌, కమాటి ప్రసాద్‌, నైట్‌ వాచ్‌మెన్‌ రామయ్య ఉన్నారు.

Updated Date - Nov 29 , 2025 | 12:24 AM