Share News

కోర్టులో నిందితుడ్ని అపహరిస్తారా?

ABN , Publish Date - Dec 26 , 2025 | 11:33 PM

పత్తికొండ కోర్టులో సరెండర్‌ పిటిషన్‌ వేసిన నిందితుడిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లడం ఏమిటని మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్‌) రాష్ట్ర ఉపాధ్యక్షుడు యు.జి. శ్రీనివాసులు, జిల్లా సభ్యుడు సి. కారప్ప ప్రశ్నించారు.

కోర్టులో నిందితుడ్ని అపహరిస్తారా?
సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ అధికారికి వినతి పత్రం అందజేస్తున్న న్యాయవాదులు

హెచ్‌ఆర్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు ఆగ్రహం

ఆదోని, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): పత్తికొండ కోర్టులో సరెండర్‌ పిటిషన్‌ వేసిన నిందితుడిని పోలీసులు బలవంతంగా తీసుకెళ్లడం ఏమిటని మానవ హక్కుల వేదిక (హెచ్‌ఆర్‌ఎఫ్‌) రాష్ట్ర ఉపాధ్యక్షుడు యు.జి. శ్రీనివాసులు, జిల్లా సభ్యుడు సి. కారప్ప ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గంజాయి కేసులో నిందితుడు శివన్న పత్తికొండ కోర్టులో లొంగిపోవడానికి పిటీషన్‌ వేయగా, అది పెండింగ్‌లో ఉండగానే పోలీసులు అతడిని బలవంతంగా జీపులో ఎక్కించుకొని పోయారన్నారు. చిప్పగిరి ఎస్‌ఐ సతీష్‌కుమార్‌, పత్తికొండ ఎస్‌ఐ విజయ్‌కుమార్‌, కానిస్టేబుల్‌ షబ్బీర్‌ మఫ్టీలో వచ్చి ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారని విమర్శించారు. చట్టాన్ని ఉల్లంఘించిన ఎస్‌ఐలు సతీష్‌, విజయ్‌కుమార్‌, కానిస్టేబుల్‌ షబ్బీర్‌లను వెంటనే సస్పెండ్‌ చేసి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై న్యాయవాది శ్రీనివాసరెడ్డి, కోర్టు సూపరింటెండెంట్‌ రాఘవేం ద్రకుమార్‌ శర్మ, పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్యలను విచారించగా పోలీసుల అతిక్రమణ స్పషమైందని పేర్కొన్నారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ అధికారికి న్యాయవాదలు వినతి పతరం సమర్పించారు. న్యాయవాదులు జీవన్‌సింగ్‌, వీరేష్‌, కేజీ వెంకటేష్‌, తాయన్న, కోసిగి వెంకటేష్‌, తబ్రేజ్‌, మస్తాన్‌, విశ్వనాథ్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Dec 26 , 2025 | 11:33 PM