కార్పొరేట్ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతా
ABN , Publish Date - Nov 01 , 2025 | 12:17 AM
బనగానపల్లె వంద పడకల ఏరియా వైద్యశాలను కార్పొరేట్ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతా మని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు.
రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి
బనగానపల్లె, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): బనగానపల్లె వంద పడకల ఏరియా వైద్యశాలను కార్పొరేట్ ఆస్పత్రిగా తీర్చిదిద్దుతా మని రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి అన్నారు. శుక్రవారం బనగానపల్లె పట్టణంలోని ఏరియా ఆస్పత్రిలో రూ.13 లక్షల విలు వగల 17 కంప్యూటర్లను ఆయన ఆస్పత్రి సూపరిం టెండెంట్ డాక్టర్ ఉమాదేవితో కలిసి ప్రారంభించారు. మంత్రి బీసీ మాట్లాడుతూ బనగానపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగి యొక్క వివరాలను కంప్యూటరీకరించనున్నట్లు తెలిపారు. ఇందులో రోగికి సంబంధించిన వ్యాధి, నివారణ మందులు, డాక్టర్ల ట్రీట్‌మెంట్ వివరాలు పొందుపరచనున్నట్లు తెలిపారు. అలాగే రూ.కోటితో ఆస్పత్రికి అవసరమైన అధునాతన వైద్య పరికరాలు తెప్పిస్తున్నట్లు తెలిపారు. అనం తరం కంప్యూటర్ గదులను, ఆస్పత్రి ఆవరణలో నిర్మిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని ఆయన పరిశీ లించారు. కార్యక్రమంలో డాక్టర్లు శైలజ, రాఘవేంద్రారెడ్డి, ఏఈ సాయికృష్ణ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు టంగుటూరు శ్రీనయ్య, నియాజ్‌హుసేన, అహమ్మద్ హుస్సేన, సహకార సంఘం చైర్మన అబ్దుల్ కలాం, అవుకు మండల టీడీపీ అధ్యక్షుడు ఉగ్రసేనారెడ్డి, ఉపసర్పంచ బురానుద్దీన, బత్తుల భాస్కర్‌రెడ్డి, గడ్డం నాగేశ్వరరెడ్డి, రాయలసీమ సలాం, షబ్బీర్, లాయర్ నాగేంద్రారెడ్డి, ఇస్మాయిల్ ఖాన, బత్తుల గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.