నల్లమలలో వన్యప్రాణుల గణాంకాలు
ABN , Publish Date - Dec 05 , 2025 | 12:03 AM
రుద్రవరం ఫారెస్టు రేంజ్ పరిధిలోని నల్లమలలో డిసెంబరు 1 నుంచి పులుల గణన ప్రక్రియ ప్రారంభించినట్లు గురువారం రేంజర్ ముర్తుజావలి తెలిపారు.
పెద్దపులి పాదముద్రల సేకరణ
రుద్రవరం, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): రుద్రవరం ఫారెస్టు రేంజ్ పరిధిలోని నల్లమలలో డిసెంబరు 1 నుంచి పులుల గణన ప్రక్రియ ప్రారంభించినట్లు గురువారం రేంజర్ ముర్తుజావలి తెలిపారు. ఫేజ్-1లో ఎనిమిది రోజుల పాటు మొదటి మూడు రోజులు ప్రతి బీట్‌లో ఐదు కి.మీ చొప్పున మొత్తం 15 కిమీ 14 బీట్‌లలో 210 కిమీ సిబ్బంది కాలిబాటన నడుస్తూ మాంసాహార జంతువులు పెద్దపులి, చిరుత, ఎలుగుబంటి, రేసు కుక్క, అడవి పిల్లి వంటి వాటిని గుర్తించార న్నారు. పాదముద్రలు, పెంటికలు, చెట్లకు గీరిన గుర్తులు గుర్తించారన్నారు. దీంట్లో పెద్దపులి పాద ముద్రలు గుర్తించామ న్నారు. శాఖాహార జంతువులను గుర్తించేందుకు ప్రతి బీట్‌లో ఉదయాన్నే 2 కిమీ చొప్పున ఒకే దిశన కాలిబాటన నడుస్తూ దుప్పి, అడవి పంది, కొండ గొర్రె, కణితి వంటి జంతువుల పెంటికలు అట వీ సిబ్బంది నమోదు చే స్తారన్నారు. అటవీ ప్రాంతంలో సహజ ఆవాసం అంచనా వేసేందుకు వృక్ష సంపద, గడ్డిరకాల జాతులను. ఔషధ మొక్కలను గుర్తిస్తామన్నారు. మొదటి మూడురోజులపాటు ట్రైల్ పాత, చివరి రెండురోజుల పాటు ట్రానసెక్ లైన నిర్వహిస్తామని రేంజ ర్ తెలిపారు.