భర్త హత్యకేసులో భార్య, ప్రియుడు అరెస్టు
ABN , Publish Date - Sep 09 , 2025 | 01:16 AM
ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన కేసులో భార్య, ప్రియుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ గంగాధర్ తెలిపారు.
ఆస్పరి, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): ప్రియుడి మోజులో పడి భర్తను హత్య చేసిన కేసులో భార్య, ప్రియుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ గంగాధర్ తెలిపారు. వివరాలు.. మండలంలోని తోగల్‌గల్ గ్రామానికి చెందిన గొల్ల అహోబిలం, గొల్ల గంగావతి భార్యాభర్తలు. వీరికి ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. ఒక కొడుకు, కుమార్తె ఉంది. జీవనోపాధి కోసం కర్ణాటకలోని యాదగిరి జిల్లా రత్నడిగి గ్రామానికి వలసవెళ్లారు. అక్కడ చెన్నబసవ అనే వ్యక్తితో గొల్ల గంగావతికి తొమ్మిది నెలల క్రితం పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం కొనసాగింది. గంగావతి భర్తను కడతేర్చేందుకు సిద్ధమైంది. ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చేందుకు నిర్ణయం తీసుకుంది. ఈనెల 3వ తేదీన దొడగొండ-తోగల్‌గల్ గ్రామాల మధ్య ప్రియుడితో కలిసి హత్య చేయించినట్లు విచారణలో తేలింది. అహోబిలం హత్య కేసులో నిందితులైన భార్య గంగావతి, ప్రియుడు చెన్నబసవను సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.