Share News

భార్యను హత్య చేసిన భర్త

ABN , Publish Date - Mar 16 , 2025 | 12:48 AM

భర్త చేతిలో భార్య హత్యకు గురైన ఘటన నందికొ ట్కూరు పట్టణంలోని బైరెడ్డి శేషశయ నారెడ్డి నగర్‌లో చోటు చేసుకుంది.

 భార్యను హత్య చేసిన భర్త
కుటుంభ సభ్యులతో నజీమూన్‌ (ఫైల్‌) ఎర్రచీర ధరించిన

నందికొట్కూరు, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): భర్త చేతిలో భార్య హత్యకు గురైన ఘటన నందికొ ట్కూరు పట్టణంలోని బైరెడ్డి శేషశయ నారెడ్డి నగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలివీ.. మొల్ల అబ్దుల్లా(26), నజీమూన్‌(21) కొంత కాలంగా పట్టణంలో జీవిస్తున్నారు. బండి ఆత్మకూరుకు చెందిన పటాన్‌ అలీబాషా కుమార్తె నజీమూన్‌కు గడివేముల మండలం మంచా లకట్ట గ్రామానికి చెందిన మొల్ల అబ్దుల్లాతో రెండున్నరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి 14 నెలల కూతురు ఉంది. మొల్ల అబ్దుల్లా తాపీమేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. నజీమూన్‌ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడటాన్ని అబ్దుల్లా తల్లి రఫియాబీ అనుమానం కలిగే విధంగా మాటలు చెప్పి తరచూ నజీమూన్‌ను కొట్టించేది. శుక్రవారం సాయంత్రం ఆమె ఫోన్‌లో మాట్లాడుతుండడంతో ఇద్దరు భార్యభర్తలు గొడవ పడ్డారు. అబ్దుల్లా ఆమెను కర్రతో చితకబాదడంతో కిందపడిపోయింది. తలకు బలమైన గాయం కావడంతో తీవ్రగాయాల పాలవగా నందికొట్కూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులకు అబ్దుల్లా సమాచారం ఇచ్చాడు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆత్మకూరు డీఎస్పీ రామాంజి నాయక్‌ పరిశీలించారు. నాజీమూన్‌ తండ్రి పటాన్‌ అలీబాషా ఫిర్యాదు మేరకు మొల్ల అబ్దుల్లా, అతడి తల్లి మొల్ల రఫియాబీలపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ సీఐ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Mar 16 , 2025 | 12:48 AM