Share News

బడి గంట మోగే వేళ

ABN , Publish Date - Jun 12 , 2025 | 12:12 AM

వేసవి సెలవుల తర్వాత జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలలు గురువారం పునఃప్రారంభం కానున్నాయి.

బడి గంట మోగే వేళ

పాఠశాల విద్యకు మహర్దశ

నేటి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం

కర్నూలు ఎడ్యుకేషన్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల తర్వాత జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలలు గురువారం పునఃప్రారంభం కానున్నాయి. పాఠశాల విద్యలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ అనేక నూతన సంస్కరణలు తీసుకువచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు 1 నుంచి ఇంటర్‌ వరకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, బ్యాగ్స్‌, రెండు జతల యూనిఫాం, షూస్‌, డిక్షనరీ కలిపి డా. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పేరుతో విద్యార్థులకు కిట్లను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు. జిల్లాకు 12,60,410 పాఠ్య పుస్తకాలు ఇండెంట్‌ పెట్టగా.. ఇప్పటికే రెండు విడతల్లో 11,85,225 పాఠ్యపుస్తకాలు సరఫరా అయ్యాయి. జిల్లా కేంద్రం నుంచి మండల స్థాయికి సరఫరా చేసి మొదటి రోజే విద్యార్థి కిట్లను పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉంచారు. నోటుపుస్తకాలు 15,35,732, బెల్టులు 1,90,782, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షినరీ 28,458లు, బ్యాగ్స్‌ 2,69,221, షూస్‌ 2,71,006 యూనిఫామ్‌ 2,69,321 జిల్లాకు చేరాయి.

తల్లికి వందనం పథకం డేటా వెరిఫికేషన్‌ చేస్తున్నాం

తల్లికి వందనం సమర్పించిన డేటా వెరిఫికేషన్‌ చేస్తున్నాం. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత తల్లుల బ్యాంక్‌ ఖాతాల్లో నగదు ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది. అలాగే మధ్యాహ్న భోజన పథకం ద్వారా సన్నబియ్యం పాఠశాలలకు సరఫరా చేశాం. జూలై 15వ తేదీలోపు కొత్త ఉపాధ్యాయ నియామకం ఉంటుంది. 90 శాతం కిట్లను త్వరలో అందజేయనున్నాం.

- శామ్యూల్‌ పాల్‌, డీఈవో

Updated Date - Jun 12 , 2025 | 12:12 AM